మాజీ హోంమంత్రి సుచరిత ఇంటి ముందు ఎమ్మెల్యే శ్రీదేవి ధర్నా

Publish Date:Aug 21, 2022

Advertisement

తాడికొండ వైసీపీలో విభేదాలు రొడ్డెక్కాయి. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నాయకురాలు, మాజీ హోంమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయిన మేకతోటి సుచరిత నివాసం ముందు ధర్నాకు దిగారు. ఇప్పటి వరకూ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న ఉండవల్లి శ్రీదేవికి అదనంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను పార్టీ అధిష్టానం అదనపు సమన్వయకర్తగా నియమించింది.

ఈ నిర్ణయాన్ని ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ అదనపు సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు ఆందోళనలకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ జిల్లా అద్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తన అనుచరులతో కలిసి ఉండవల్లి శ్రీదేవి మేకతోటి సుచరిత నివాసం ముందు బైఠాయించి ధర్నాకు దిగడంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా రోడ్డెక్కినట్లైంది.

కాగా సుచరిత స్వయంగా ఉండవల్లి శ్రీదేవిని బుజ్జగించి నిరసన విరమింప చేశారు. అదనపు సమన్వయ కర్త నియామకం విషయాన్ని అధిష్ఠానంతో మాట్లాడి పరిష్కరిస్తానని సుచరిత హామీ ఇవ్వడంతో ఉండవల్లి శ్రీదేవి తన ఆందోళన విరమించారు. కాగా ఎమ్మెల్యే స్వయంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలి నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగడంతో మేకతోటి సుచరిత నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.