జగన్ సర్కార్ పై స్వరూపానంద ఫైర్!

Publish Date:Apr 24, 2023

Advertisement

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద   ఏపీ ప్రభుత్వ రాజగురువుగా గుర్తింపు పాందారు. ముఖ్యమంత్రి జగన్ తన మత విశ్వాసాలకు భిన్నంగా అయిన దానికీ కానీ దానికీ విశాఖ శారదా పీఠాధిపతి ఆశీస్సులు పొందుతూ వచ్చారు. ఇందుకు జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న చెలిమి కారణమని కూడా చెబుతారు.

కేసీఆర్ ను ప్రసన్న చేసుకునేందుకు ఏపీ సర్కార్ తరఫున శారదా పీఠానికీ, స్వరూపాదనం కూ జగన్ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చారు. అయితే ఇప్పుడు అందంతా గతం. స్వరూపానంద ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.  అప్పన్న చందనోత్సవ సమయంలో ఆయన చేసిన విమర్శలు జగన్ సర్కార్ ను నడిరోడ్డుపై నిలబెట్టేసినట్లుగా ఉన్నాయి.  ఇంత కాలం దేవాలయయాలలో జరిగిన అపచారాలు, రధం దగ్ధం ఘటనలు, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న విపరీత నిర్ణయాలూ వేటినీ ప్రశ్నించని, పై పెచ్చు సమర్ధించిన స్వరూపానంద.. తాజాగా సింహాద్రి అప్పన్న చందనోత్సవ సమయంలో భక్తులకు కలిగిన అసౌకర్యానికి, ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ వైఫల్యానికి ఆయన ఫైర్ అయిపోయారు.

ఈవో ను నియమించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుపట్టారు. టికెట్లను ఇష్టారీతిగా అమ్ముకున్నారనీ, అధికారులు వీవీఐపీలను, సంపన్నులను తప్ప సామాన్యులను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. అసలు దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత కాలం జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలిచిన స్వరూపానంద..ఇప్పుడిలా యూ టర్న్ తీసుకోవడానికి చందనోత్సవ వేళ భక్తులకు కలిగిన అసౌకర్యాలపై, అస్తవ్యస్త ఏర్పాట్లపై ఇంతలా ఫైర్ అయిపోయారేంటి? అని జనం ఆశ్చర్యపోతున్నారు.

తిరుమలలో కాటేజీల రెంట్లు విపరీతంగా పెంచేసినప్పుడు కానీ, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తులకు కలిగిన ఇక్కట్ల గురించి కానీ నోరెత్తని స్వరూపానంద ఇప్పుడెందుకు జగన్ పేరెత్తకుండానే.. ఆయన పాలనా వైఫల్యమే అప్పన్న చందనోత్సవ కార్యక్రమం రసాబాసగా మారడానికి కారణమంటూ విమర్శలు గుప్పించారు? ఇటీవల స్వరూపానంద వారసుడు స్మాత్యేంద్రానంద… తాము ఏ పార్టీకి అనుబంధం కాదని ప్రకటించిన విషయాన్నీ ఈ సందర్భంగా జనం గుర్తు చేస్తున్నారు. అప్పన్న చందనోత్సవం కార్యక్రమం భక్తుల ను పక్కన పెట్టేసి పూర్తిగా  వీఐపీల కోసం అన్నట్లుగా సాగిందని విమర్శలు గుప్పించిన స్వరూపానంద తాను స్వయంగా వీఐపీ దర్శనమే చేసుకున్నారు. భక్తుల ఆగ్రహావేశాలు, జగన్ సర్కార్ పట్ల జనంలో వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకతను గమనించే స్వరూపానంద తన పీఠం గౌరవాన్ని కాపాడుకోవడం కోసమే ఇలా విమర్శలు గుప్పించారని అంటున్నారు.

ఇంకా జగన్ ప్రాపకం కోసం పాటుపడితే.. తన పరువు, పీఠం పరువు గంగలో కలుస్తుందన్న భయంతోనే ఆయన సెల్ఫ్ ప్రొటక్షన్ కోసం ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు. ఆ తరువాత మాట మార్చి.. తాను ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపలేదనీ, చందనోత్సవ వేళ భక్తుల ఇక్కట్లకు కారణం అధికారుల నిర్లక్ష్యమేనని మాత్రమే విమర్శించాననీ చెప్పుకున్నా అది పెద్దగా జనంలోకి వెళ్ల లేదు. ప్రభుత్వ వైఫల్యం, అసమర్థతలపై స్వరూపానంద ఫైర్ అయ్యారన్నదే జనంలోకి బాగా వెళ్లింది.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.