Publish Date:May 11, 2022
తస్మదీయులను వేధించడానికి దేశ ద్రోహం కేసును ఉపయోగించుకోవాలనుకునే ప్రభుత్వాలకు సుప్రీం చెక్ పెట్టింది. కాలం చెల్లిన ఈ చట్టంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. ఇకపై రాజద్రోహం కేసులు నమోదు చేయవద్దనీ, ఇప్పటికే నమోదైన కేసులపై చర్యలు తీసుకోవద్దనీ విస్పష్ట ఆదేశాలిచ్చింది.
రాజ ద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ సుప్రీం కోర్టు చారిత్రక ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ ఎన్నీ రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం దేశద్రోహ చట్టంపై సమీక్ష పూర్తయ్యే వరకూ ఆ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయవద్దని విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ చట్టం కింద కేసులు నమోదై, జైళ్లలో ఉన్న వారు బెయిలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే ఇప్పటికే నమోదైన కేసులలో ఎటువంటి చర్యలూ తీసుకోరాదని విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. రాజద్రోహ చట్టం సెక్షన్ 124ఎ అమలుపై స్టే ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై పున:పరిలీలన పూర్తయ్యే వరకూ ఈ చట్టం కింద కేసులు నమోదు చేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఇదే చట్టం కింద దేశంలో గత పదేళ్లలో 13వేల 306 కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో శిక్షలు పడినవి చాలా చాలా తక్కువ. కాగా ఈ చట్టాన్ని అలహాబాద్ హైకోర్టు గతంలోనే కొట్టేసింది. రాజద్రోహం చట్టాన్ని అడ్డు పెట్టుకొని దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు తప్పుడు కేసులు పెడుతున్నాయనే విమర్శలున్నాయి.
వలసపాలకులు పోయినా, నాటి వలస చట్టాన్ని ఇంకా దాన్ని కొనసాగించడంపై ఆలోచించాలని కొంత కాలంగా సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్న సంగతి విదితమే. మరోవైపు రాజద్రోహం కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్రం సుప్రీంకు తెలియజేయడంతో.. సమీక్ష పూర్తయ్యే వరకూ ఈ చట్టం కింద కేసులు నమోదు చేయరాదంటూ, ఇప్పటికే నమోదైన కేసులలో ఎలాంటి చర్యలూ తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. రాజద్రోహ చట్టాన్ని వేధింపుల కోసం దుర్వినియోగం చేసిన ఘటనలు ఏపీలో ఇటీవల చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామరాజుపై రాజద్రోహ నేరం కింద కేసు నమోదు చేసింది జగన్ సర్కార్. అలాగే రఘురామ రాజు ప్రసంగాలను ప్రసారం చేసినందుకు రెండు ప్రముఖ చానళ్లపై కూడా జగన్ సర్కార్ రాజద్రోహ నేరం కింద కేసులు నమోదు చేసింది.
ఈ కేసులపై ఆ చానెళ్లు సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. ఇలా ఉండగా రాజద్రోహం కేసుపై సుప్రీం స్టే విధించడం చరిత్రాత్మకమని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమను వ్యతిరేకించే వారిపైనా, తమ విధానాలను విమర్శించేవారిపై రాజద్రోహ నేరంకింద కేసుపెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రఘురామ రాజు అన్నారు. అందుకు తనపై పెట్టిన తనపై రాజద్రోహం కేసే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం మీడియా, ఇతరులపై కూడా రాజద్రోహం కేసు పెట్టిందని గుర్తు చేశారు. రాజద్రోహ చట్టం సెక్షన్ 124ఎ కింద కేసులు నమోదు చేయవద్దంటూ సుప్రీం కోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని రఘురామ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-stay-on-sedition-law-39-135744.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.