Publish Date:Jun 24, 2022
సుప్రీంలో కాంగ్రెస్ ఎంపీ జకియా జఫ్రీకి చుక్కెదురైంది. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోడీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ గతంలో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆమె పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ నాడు స్పెషల్ మెట్రో పాలటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. 2002 ఫిబ్రవరి 28న అల్లరి మూకల దాడిలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సహా 68 మంది మరణించిన సంగతి విదితమే.
దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. నాటి అల్లర్లపై దర్యాప్తు జరిపిన సిట్ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, సహా మరికొందరికి అల్లర్లతో ఎటువంటి సంబంధం లేదని తేల్చింది. అయితే నరేంద్రమోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఇషాన్ జఫ్రీ సతీమణి జకియా షఫ్రి పలు కోర్లులలో సవాల్ చేశారు.
అన్ని చోట్లే ఆమెకు చుక్కెదురైంది. దాంతో 2008 మార్చిలో జకియా షఫ్రి దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు సిట్ ను నియమించి అల్లర్ల కేసు దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో సిట్ ఈ అల్లర్లపై విచారణ చేపట్ఠింది.
2010లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని దాదాపు 10 గంటల పాటు విచారించింది. అనంతరం సిట్ మోడీ నిరపరాధి అంటూ సుప్రీం కు నివేదిక సమర్పించింది. దీనిని సవాల్ చేస్తూ జకియా జాఫ్రి 2102లో మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. అంతకు ముందు అహ్మదాబాద్ హైకోర్టు కూడా సిట్ నివేదికను సమర్ధించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఆ తీర్పునే సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-gives-clean-chit-to-modi-in-gujarat-roitd-case-39-138335.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది