Publish Date:Jan 28, 2025
చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ఈ సందర్భంగా ఇదొక పనికిమాలిన పిటిషన్ అని వ్యాఖ్యానిస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి మరొక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని, అసలీ పిటిషన్ పై వాదించడానికి ఎలా వచ్చారంటూ పిటిషన్ తరఫున్యాయవాదిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
ఇంతకీ విషయమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బాలయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మంగళవారం సుప్రీం కోర్టులో జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ అటెండ్ అయ్యారు. ఆయన తన వాదనలు ప్రారంభించకముందే సుప్రీం కోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇటువంటి పిటిషన్లను వాదించడానికి ఎలా వచ్చారు అంటూ జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని పేర్కొన్న జస్టిస్ ఈ పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తాం అంటే హెచ్చరించారు.
జగన్ హయాంలో చంద్రబాబుపై సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు, ఏపీ ఫైబర్‌నెట్, రాజధాని భూములు, అమరావతి అసైన్డ్ భూములు, ఉచిత ఇసుక విధానం, మద్యం విధానం వంటి అంశాలపై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 50 రోజులకు పైగా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులపై విచారణ కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో.. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో సీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరగదని అందుకే చంద్రబాబుపై సీఐడీ కేసులన్నిటినీ సీబీఐకి బదలీ చేయాలని కోరుతూ బాలయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టివేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-dismiss-petition-seeking-transfer-of-cid-cases-on-cbn-to-cbi-25-191975.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.