Publish Date:Nov 25, 2024
నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ పాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. గతంలో ఆయన ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కూడా విజయ్ పాల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయ్ పాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంలో కూడా ఆయనకు చుక్కెదురైంది.
సీఐడీ కస్టడీలో తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు చేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ పాల్ గత నెలలలో హైకోర్టును, ఆ తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండు కోర్టులలోనూ ఆయనకు చుక్కెదురవ్వడంతో ఆయన అరెస్టు అనివార్యం అని చెప్పవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-dismiss-dismiss-vijay-paul-anticipatory-bail-petition-25-188948.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.
Publish Date:Sep 30, 2026
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!