రేపు సర్వం బంద్..ఒక్కటైన శ్రామిక లోకం

Publish Date:Feb 26, 2012

Advertisement

న్యూఢిల్లీ: దేశంలోని కార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో మంగళవారం దేశ వ్యాప్త 'సార్వత్రిక సమ్మె'కు దిగుతున్నాయి. దీంతో.. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ రంగంలో నడిచే బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మంగళవారం ఒక్క రోజు పాటు మూతపడనున్నాయి. పోస్టల్ సర్వీసులు, పోర్టులు తదితర కీలక సర్వీసులూ సమ్మె బాట పట్టనున్నాయి. తమ హక్కుల సాధన కోసం ఏకంగా 10 కోట్ల మంది కార్మికులు ఒక్క రోజు  సమ్మెకు దిగనుండటంతో.. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల కార్యకలాపాలన్నీ మంగళవారం స్తంభించిపోనున్నాయి.

సరళీకరణ విధానాల నేపథ్యంలో కార్మిక హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా దేశంలోని కార్మిక సంఘాలన్నీ.. మంగళవారం దేశ వ్యాప్త 'సాధారణ సమ్మె'కు పిలుపునివ్వడమే ఇందుకు కారణం. కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ సహా వివిధ పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ.. తమ తమ సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి ఇలా ముక్త కంఠంతో సమ్మెకు దిగడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఒక్కటైన కార్మిక లోకం నిజానికి.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ సమ్మె విషయంలో ఐదు డిమాండ్లతో రూపొందించుకున్న  చార్టర్ ప్రాతిపదికన ఒకే వేదిక మీదకు వచ్చాయి. కార్మిక చట్టాలన్నింటినీ కచ్చితంగా అమలు చేయడం, వీటిని ఉల్లంఘించే వారికి కఠిన శిక్షలు అమలు చేయడం, గుర్తింపు పొందని రంగాల్లో ఉన్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, కార్మికుల కోసం జాతీయ భద్రతా నిధిని ఏర్పాటు చేయడం అన్నవి ఈ ఐదు డిమాండ్లు.

ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడాన్ని నిలిపివేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక వివిధ బ్యాంకులకు చెందిన కార్మిక యూనియన్లు ఏడు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నాయి.  కాగా.. సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని.. దీనిపై తాము చర్చలకు సిద్ధమన్న కేంద్రం ప్రతిపాదనను కార్మిక సంఘాలన్నీ తిరస్కరించాయి. మూడు నెలల కిందట తాము సమ్మెకు పిలుపునిస్తే.. ఇప్పుడు చర్చలకు పిలవడం హాస్యాస్పదమని కార్మిక నేతలు అన్నారు.


కాగా, ఈ  బంద్‌ ప్రభుత్వాలకు హెచ్చరికలని వామపక్షాల నాయకులు అన్నారు. నిత్యావసరాల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, వస్త్రాలపై వ్యాట్‌, విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనల నేపథ్యంలో ప్రజానీకం తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. 28న సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా వామపక్షాల నగర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో మోటారు సైకిళ్లతో ప్రదర్శన జరిగింది. ఈ సందర్బంగా  నారాయణ మాట్లాడుతూ 28న జరిగే సమ్మెను, బంద్‌ను జయప్రదం చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలన్నారు. వివిధ తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రకరకాల పన్నుల పేరుతో ప్రజల నడ్డివిరుస్తోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయటం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By
en-us Political News

  
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.