హెచ్ 1 బీ వీసా.. లక్ష డాలర్ల ఫీజు రద్దుపై స్టే

Publish Date:Jun 16, 2026

Advertisement

 

అమెరికాలో ఐటీ కొలువు సాధించాలనే కలలు కనే భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులకు,   వారిని నియమించుకునే అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు  ఊహించని షాక్ తగిలింది. తీవ్ర వివాదాస్పదమైన లక్ష డాలర్ల  హెచ్‌ 1బీ  వీసా ఫీజును రద్దు చేస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని రోజులకే..  అదే కోర్టు తన పాత నిర్ణయంపై  స్టే విధిస్తూ..   ఈ  ఫీజును పునరుద్ధరించింది. ఈ సంచలన నిర్ణయంతో అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ అయిన యూఎస్‌సీఐఎస్‌ కు మళ్లీ ఆ భారీ మొత్తాన్ని వసూలు చేసేందుకు మార్గం సుగమమైంది.

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రత్యేక కేటగిరీల కింద దాఖలు చేసే హెచ్‌-1బీ వీసా పిటిషన్ల కోసం లక్ష డాలర్ల ఫీజును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అసాధారణమైన నిర్ణయం టెక్ కంపెనీలపై మోయలేని పెను భారంగా మారిందని, వారి వ్యాపార,  నియామక ప్రణాళికలను   దెబ్బతీస్తోందని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే   జూన్ 8వ తేదీన మసాచుసెట్స్ జిల్లా కోర్టు ఈ వివాదాస్పద ఫీజును పూర్తిగా కొట్టివేస్తూ కీలకమైన తీర్పును వెలువరించింది.

జూన్ 8 నాటి తీర్పులో  లక్ష డాలర్ల  రుసుము అనేది సాధారణ చట్టబద్ధమైన ఫీజు కాదనీ..  ఇది ఒక రకమైన పన్ను రూపంలో ఉందనీ పేర్కొంది. కేవలం అధ్యక్షుడి ఆజ్ఞలు,  విచక్షణ అధికారాల ద్వారా ఇలాంటి పన్నును విధించడం పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.   అమెరికా వలస చట్టాల పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ (ఏపీఏ) నిబంధనలను కూడా ఈ నూతన విధానం  ఉల్లంఘిస్తోందని  కోర్టుర తన తీర్పులో పేర్కొంది.  

అయితే.. మసాచుసెట్స్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమెరికా ప్రభుత్వం  అప్పీల్   చేసింది. ఈ అప్పీల్‌పై తుది విచారణ పూర్తయ్యే వరకు పాత పద్ధతిలోనే ఫీజు వసూలును కొనసాగించేందుకు అనుమతించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన జిల్లా కోర్టు జూన్ 8న ఇచ్చిన తీర్పు అమలుపై  స్టే ఇచ్చింది.  ఈ   అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

తాజా కోర్టు ఉత్తర్వుల కారణంగా కాన్సులర్ నోటిఫికేషన్ ద్వారా దాఖలు చేసే కొన్ని ప్రత్యేక హెచ్‌-1బీ పిటిషన్లకు కంపెనీలు  తప్పనిసరిగా లక్ష డాలర్ల   ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందనేది ఇప్పుడు పూర్తిగా అప్పీల్స్ కోర్టు చేతుల్లో ఉంది. ఒకవేళ ప్రభుత్వ స్టే అభ్యర్థనను అప్పీల్స్ కోర్టు అంగీకరిస్తే, సుదీర్ఘకాలం పాటు సాగే ఈ న్యాయపోరాటంముగిసే  వరకు కంపెనీలు ఈ  ఫీజు భరించక తప్పదు. ఒకవేళ కోర్టు ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తే, జూన్ 8 నాటి తీర్పు మళ్లీ అమల్లోకి వచ్చి ఫీజు రద్దవుతుంది. ప్రభుత్వం తన తుది స్టే అభ్యర్థనను జూన్ 18లోగా అప్పీల్స్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. ఈ నిరంతర న్యాయపరమైన అనిశ్చితి వల్ల అంతర్జాతీయ నియామకాలు మరియు ఐటీ ఉద్యోగాల భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో పడింది.

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.