వివాదంలో చిక్కుక్కున్న స్టార్ కపుల్స్ సావిటీ బురా, దీపక్ హుడా
Publish Date:Feb 27, 2025
Advertisement
అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కపుల్స్ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా బాక్సర్ అయిన సావిటీ బురా తన భర్త, మాజీ కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై కేసు నమోదు చేశారు. వరకట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపక్ హుడా మరో వైపు తన భార్య సావిటీ బురా కుటుంబంపై బెదిరింపులు ఆర్థిక మోసం ఆరోపణలు చేస్తూ రోహ్తక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ఈ క్రీడాకారులు పెళ్లి చేసుకుని జంటగా మారారు. కొన్ని రోజుల క్రితం ఈ జంట మధ్య విభేధాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విపరీతంగా ట్రోలింగ్ చేసుకున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి కేసులు నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా బాక్సర్ సావీటీ బురా, ఆమె భర్త, భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ హుడా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హుడాపై సావీటీ గృహ హింస, వరకట్న వేధింపుల ఆరోపణలు చేయగా, ఆమె కుటుంబం తనను ఆర్థికంగా మోసం చేసిందని భర్త హుడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ కపుల్ ఒకరిపై ఒకరు హిసార్, రోహ్తక్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు. మన దేశానికి చెందిన ప్రముఖ క్రీడాకారులుగా పేరు తెచ్చుకున్న అంతర్జాతీయ మహిళా బాక్సర్ సావీటీ బురా, భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ హుడా మధ్య వివాదం క్రమంగా ఉగ్ర రూపం దాల్చింది. సావీటీ బురా తన భర్త దీపక్ హుడాపై గృహహింస, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేస్తూ హర్యానాలోని హిసార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
http://www.teluguone.com/news/content/star-couples-savity-bura-and-deepak-hooda-who-are-caught-in-the-controversy-25-193518.html





