స్పీడ్ న్యూస్ 2

Publish Date:Jul 15, 2023

Advertisement

1. రాష్ట్రం గంజాయి సరఫరా వెనుక ముఖ్యమంత్రి వైయస్ జగన్ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అందుకే గంజాయిని ఆరికట్ట లేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో గంజాయిపై రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. భారతదేశానికి డ్రగ్స్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందంటూ వివరించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. తన పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నారని లోకేశ్ తెలిపారు. 

................................................................
 

2. పశ్చిమ గోదావరి జిల్లా అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల అక్రమణలపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పర్యావరణపరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని అందులో పేర్కొన్నారు. 1950 నుంచి దాదాపు 3,255 ఎకరాల భూమి అటవీ శాఖ అధీనంలో ఉందని.. కానీ, సంబంధిత శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కొంత భూమిని సాగుభూమిగా ప్రకటించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు అప్పట్లో తీసుకున్న నిర్ణయంపై కోర్టులో వివాదం నడుస్తోందన్నారు. 

...................................................


 

3. వాలంటీర్ల పోస్టులంటే యువతను నిర్వీర్యం చేయడమే కదా? అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై ఢిల్లీలో ఆయన మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లని విజయసాయిరెడ్డి వంటి వాళ్లే చెప్పారు. పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఆయనను విమర్శిస్తున్నారు. కుటిల రాజకీయ నీతితో నిర్మించిందే వాలంటీర్ల వ్యవస్థ. సేవ చేసేందుకు వచ్చిన వాళ్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తారా? మీరు తెచ్చిన వ్యవస్థపై మీకే నమ్మకం లేక అంబటి రాయుడితో కితాబు ఇప్పించుకున్నారా? వాలంటీర్ల పేరుతో ఇంతమంది యువత భవష్యత్తును నాశనం చేస్తారా?అని రఘురామ నిలదీశారు. 

..................................................


 

4. కోనసీమ జిల్లాలోని శివకోటి ఆక్వా చెరువు వద్ద బోరుబావి నుంచి గ్యాస్, అగ్నికీలలు ఎగసిపడటానికి గ్యాస్ పైప్‌లైన్ కారణం కాదని, అక్కడ అసలు పైప్‌లైన్ లేదని ఓఎన్జీసీ సిబ్బంది తేల్చారు. భూమి పొరల్లో గ్యాస్, నీరు ద్వారానే మంటలొచ్చాయని చెప్పారు. బోరును మరింత లోతుగా తవ్వడం వల్లే అగ్నికీలలు ఎగసిపడ్డాయని పేర్కొన్నారు. నరసాపురం నుంచి ప్రత్యేక బృందం వస్తుందని, వారు వచ్చాకే మంటల్ని అదుపు చేయడం సాధ్యపడుతుందన్నారు.  

.............................................

5. రామతీర్ధం అనువంశక ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు పూర్ణ కలశంతో స్వాగతం పలికిన అర్చకులు షోకాజ్ నోటీసులు అందుకొన్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్రలో భాగంగా రామతీర్ధం కూడలిలో అశోక్‌ గజపతిరాజును ఆరుగురు అర్చకులు ఆశీర్వదించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో కిషోర్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. అశోక్‌ గజపతి రాజును ఆశీర్వదించిన ఆరుగురు అర్చకులకు ఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తమకు తెలియకుండా టీడీపీ నేతలకు ఎలా స్వాగతం పలుకుతారంటూ ప్రశ్నిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.  అర్చకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

.....................................................

6. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు.  అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించిన తర్వాత.. ఆ దంపతులకు అర్చకులు ఆశీస్సులు, ప్రసాదం, శేషవస్త్రం అందించారు.

...........................................................

7. రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. బీహార్‌లో గత 24 గంటల్లో పిడుగులు పడి 18 మందికిపైగా మృతి చెందారు. రోహ్‌టాస్ జిల్లాలో ఐదుగురు, ఆర్వాల్‌లో నలుగురు, సరన్‌లో ముగ్గురు, ఔరంగాబాద్, తూర్పు చంపరాన్ జిలాల్లో చెరో ఇద్దరు, బంక, వైశాలి జిల్లాలో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.

.....................................


8. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంపద.. ప్రజలకు పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్స్, దేశంలో క్యాప్టలిస్టులు కలిసి తెలంగాణని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలే తమ అజెండా అని.. అలాగే ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తామన్నారు. సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

...............................

9. గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ కార్యకర్తలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ గాంధీ భవన్‌కు రేవంత్ వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. దీంతో వారి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆందోళనలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. 

.........................................

 

10. విదేశాలకు వెళ్లి అక్కడ మరణించిన భారతీయుల మృతదేహాలు లేదా ఆస్థికలు స్వదేశానికి తీసుకురావడానికి ప్రామాణిక నిర్వహణ పద్దతులను విదేశీ వ్యవహారాల శాఖ తన వెబ్‌సైట్‌లో ప్రముఖంగా ప్రచురించాలని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 13న ఆదేశించింది. భారత్ నుంచి విమాన ప్రయాణాలను నిర్వహించే పౌర విమానయాన సంస్థలు కూడా తమ వెబ్‌సైట్లలో ఎస్‌ఓపీని ప్రచురించాలని తెలిపింది. భారతీయ పర్యాటకులు విదేశాల్లో మరణిస్తే, అక్కడి భారత రాయబార కార్యాలయం మృతుని కుటుంబంతో సంభాషణ సంప్రదింపులు జరపాలని, ఆ కుటుంబానికి ఆర్థిక స్తోమత లేకపోతే మన దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేసిన భారతీయ కమ్యూనిటీ సంక్షేమ నిధి నుంచి సముచిత చెల్లింపులు జరిపి ఆదుకోవాలని సూచించింది. ఇటీవల ఓ భారతీయ పర్యాటకుడు మాల్దీవులకు వెళ్లి మరణించారు. ఆయన అవశేషాలను స్వదేశానికి తీసుకొచ్చే క్రమంలో సమస్యలు తలెత్తడంతో వ్యవహారం హైకోర్టు దృష్టికి వచ్చింది. ఎస్ఓపీ, సంక్షేమ నిధి గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. 

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.