Publish Date:Apr 19, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 75 పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నాయకులంతా వారి ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అన్ని మతాల వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలుగా ఉన్నారన్న ఆయన.. మసీదులు, చర్చిల్లోనూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.
Publish Date:Apr 19, 2025
మే 7 నుంచి మే 31 వరకూ హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత అందాలను ప్రదర్శించేలా ఒక ఏర్పాటు చేయనుంది రాష్ట్ర పర్యాటక శాఖ.
Publish Date:Apr 19, 2025
ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాల విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీషు మాధ్యమంలో 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది పరీక్షలు రాశారు.
Publish Date:Apr 19, 2025
ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్దదైన విశాఖపట్నం నగరపాలక సంస్థ తెలుగుదేశం కూటమి వశం అయ్యింది. వైసీపీ చేతిలో ఉన్న ఈ మేయర్ పీఠన్ని దక్కించుకోవడానికి తెలుగుదఏశం కూటమి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి వ్యూహాలు, వైసీపీ ప్రతి వ్యూహాలతో గత కొన్ని రోజులుగా విశాఖలో రాజకీయ వేడి పెరిగిన సంగతి తెలిసిందే.
Publish Date:Apr 19, 2025
తెలంగాణలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమయింది. ఈ నెల 22న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను విడుదల చేయబోతున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే.
Publish Date:Apr 19, 2025
తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగర్ కర్నూల్‌లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వెళ్లారు.కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది.
Publish Date:Apr 19, 2025
హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై రీట్వీట్ చేసిన కేసులో విచారణకు సీనియర్ ఐఏఎస్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. ఈ పోస్ట్‌ను 2000 మంది కూడా రీట్వీట్ చేశారని మరి వారి మీద కూడా చర్యలు ఉంటాయా లేదా నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారినే టార్గెట్ చేస్తున్నారా అని పోలీసులను నిలదీశారు.
Publish Date:Apr 19, 2025
ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో ఎండీ సహా ఆ సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులపై విశాఖలో కేసు నమోదైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లీజ్ అనుమతులు లేకుండా మరో ఐటీ కంపెనీకి భవనాన్ని లీజుకు ఇచ్చారంటూ వచ్చిన ఫిర్యాదు పై విశాఖలోని ద్వారక నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
Publish Date:Apr 19, 2025
సెలబ్రిటీలను పార్టీలో చేర్చుకుని లబ్ధి పొందే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీలు పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభకు సెలబ్రిటీలను పంపించడం ద్వారా వారి గ్లామర్ ను, కరిష్మాను పార్టీ బలోపేతనికి వినియోగించుకునే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి.
Publish Date:Apr 19, 2025
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 20 పైగా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే,అందులో బీజేపీ జెండా ఎగిరిన ఒకే ఒక్క నియోజక వర్గం గోషామహల్. ఈ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకసారి కాదు.. వరసగా మూడు సార్లు గెలిచారు. కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నట్లుగా రాజా సింగ్ కరుడు కట్టిన హిందుత్వవాది.
Publish Date:Apr 19, 2025
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. ఉత్తరాదిన పాగా వేసిన బీజేపీకి దక్షిణాది కొరుకుడు పడటం లేదు.
Publish Date:Apr 19, 2025
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు.
Publish Date:Apr 18, 2025
విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెంటనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన రాజీనామా ప్రకటన ఒక విధంగా చెప్పాలంటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే పెను సంచలనం సృష్టించింది. అదీ జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత పెద్దగా సమయం తీసుకోకుండానే పార్టీకీ రాజీనామా చేఃసి రాజకీయ సన్యాసం ప్రకటించేశారు.