సోనియానే సుప్రీం లీడర్.. అందరి నోటా అదే మాట!

Publish Date:Oct 19, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ( అక్టోబర్ 19) న కౌంటింగ్ జరుగుతుంది. పోటీలో ఉన్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లలో ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు. అయినా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ  మంత్రి  చిదంబరం చెప్పినట్లుగా  అందిరికీ తెలిసిందే అయినా, శంఖంలో పోసే వరకు ఆగితే పోయేదేమీ లేదు.

అయితే  ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది అసలు ప్రశ్నే కాదు. అయితే ఖర్గే కాదంటే (అనే ప్రశ్నే లేదని అంతరాత్మ ఘోషిస్తోంది) థరూర్. ఇద్దరిలో ఎవరు గెలిచినా పెద్దగా ఫరక్ పడదు. కానీ, ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో గాంధీలు కాకుండా వేరొకరు కూర్చోవడం కాంగ్రెస్ నాయకులు చాలా మందికి, ఇదొక అనూహ్య వాస్తవం, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చును.  

అదలా ఉంటే కాంగ్రెస్ వ్యవహారాల్లో ఇకపై గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంకా) పోషించే పాత్ర ఏమిటి? ఇప్పడు చాలా మందిలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వాదుల్లో ఉన్న సందేహం ఇది. అయితే  అధ్యక్ష పదవిలో లేనంత మాత్రాన గాంధీలు కాంగ్రెస్ కు దూరమై పోతారనో, పార్టీలో వారి పలుకు బడి పెత్తనం పలచబడి పోతుందనో అనుకుంటే అది పొరపాటే అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎవరి దాకానో ఎందుకు, అధ్యక్ష రేసులో ముందున్న మల్లికార్జున ఖర్గేనే ఎన్నికల్లో తాను గెలిస్తే పార్టీని ముందుకు తీసుకుపోయే విషయంలో గాంధీల సూచనలు, సలహాలు తప్పక తీసుకుంటానని స్పష్టం చేశారు.

అంతే కాదు  గాంధీల డైరెక్షన్ లో పనిచేయడం అవమానంగా భావించనని  రిమోట్ కంట్రోల్ అని అవహేళన చేసినా పట్టించుకోనని ఖర్గే తేల్చి చెప్పారు. శశి థరూర్ అంత ఓపెన్ గా ఆ మాట అనక పోయినా గాంధీల నాయకత్వాన్ని కాదనలేమని అయితే అంగీకరించారు. అంతే కాదు గాంధీలను దూరంగా పెట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు స్వతంత్రంగా పనిచేయడం అయ్యేపని కాదని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత  40 ఏళ్లకు పైగా  కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించిన గాంధీల డిఎన్ఎనే కాంగ్రెస్ రక్తంలో ప్రవహిస్తోందని థరూర్ కాంగ్రెస్ పార్టీ ని గాంధీలను వేరు చేసే చూడలేమని తేల్చి చెప్పారు. 

అధ్యక్ష రేసులో ఉన్న ఆ ఇద్దరే కాదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబికాసోనీ, ముకుల్ వాస్నిక్, చిదంబరం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్  ఇంకా అనేక మంది పార్టీ సీనియర్, జూనియర్ నాయకులు అందరూ కూడా  అధ్యక్షుడు ఎవరైనా గాంధీల నాయకత్వంలో పనిచేయవలసిందే అనే అభిప్రాయాన్నే వ్యక్త పరిచారు. గాంధీలతో కాంగ్రెస్ ను వేరు చేసేప్రయత్నాలు ఫలించవని అంబిక సోనీ పేర్కొంటే, ముకు వాస్నిక్ సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా  గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ మూల స్థంభంగా నిలుస్తుంది, సోనియా గాంధీ పార్టీ నేతగా కొనసాగుతారని అన్నారు. సోనియా గాంధీ స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో కాంగ్రెస్ ముందకు సాగుతుందని వాస్నిక్ స్పష్టం చేశారు.

అలాగే, రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తామని, మరో సీనియర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు.  నిజానికి, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవితో పాటుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సహా ఇతర  కీలక పదవుల్లో కొనసాగుతారు. అయినా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గాంధీలకు పదవులు ఎందుకు.. పదవులు ఉన్నా లేకున్నా ... కాంగ్రెస్ అంటే గాంధీలు, గాంధీలు అంటే కాంగ్రెస్ ... అంతేగా ...

By
en-us Political News

  
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
ఎమ్మెల్సీగా వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 20) ప్రమాణ స్వీకారంచేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు వర్ల రామయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.