ఇన్ చార్జికి ముఖం చాటేసిన సోము వీర్రాజు? ఆయన సీన్ అయిపోయిందా?

Publish Date:Feb 26, 2023

Advertisement

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధిష్ఠానం ఆయనపై ఆగ్రహంగా ఉందా? రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారడానికి సోము వీర్రాజు తీరే కారణమని భావిస్తోందా? అంటే పార్టీ వర్గాలు ఔననే అంటున్నాయి. అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని తెలియడం వల్లనే సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ రాజమహేంద్ర వరం వచ్చినా ఆయనను కలవకుండా మొహం చాటేశారని అంటున్నారు.  

ఏపీ బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో మెజారిటీ నాయకులు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేయడంతో రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుని సమస్య పరిష్కారం కోసం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేంద్ర మంత్రి మురళీధరన్ రాష్ట్రానికి వచ్చారు.  నేరుగా రాజమహేంద్రవరం వెళ్లారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఆయనకు ఎదురుపడలేదు. సాధారణంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రాష్ట్ర పర్యటనకు వస్తే పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఎదురు వెళ్లి ఆహ్వానించడం అన్నది ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా సోము వీర్రాజు అసలు మురళీధరన్ కు ఎదురు పడలేదు. ఆయన రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన సమయంలో సోము వీర్రాజు కడప పర్యటనకు వెళ్లారు. 

ఏపీ బీజేపీలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి సోము వీర్రాజు చేరుకున్నారు. అందుకే ఆయన మురళీధరన్ కు మొహం చాటేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇటీవల ఏపీ నుంచి పలువురు నేతలు హస్తిన వెళ్లి మరీ అధిష్ఠానానికి సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. వారు అలా ఫిర్యాదు చేసి వచ్చారో లేదో.. ఇలా పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ రాజమహేంద్రవరం చేరుకున్నారు.  పోతే సోము వీర్రాజు ముఖం చాటేసినా మురళీధరన్ మాత్రం రాజమండ్రిలో పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా పలు ఇతర జిల్లాల నుంచి కూడా నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చి సోముకు వ్యతిరేకంగా గళమెత్తినట్లు చెబుతున్నారు.   ఏపీ బీజేపీలో ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభానికీ, నాయకులు, కార్యకర్తలలో అసంతృప్తికీ సోము వీర్రాజే కారణమని మురళీధరన్ కు పలువురు చెప్పినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో సహా పలువురు పార్టీకి రాజీనామా చేయడం, ఆ రాజీనామాల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదని ఆ తరువాతి పరిణామాలు స్పష్టం చేయడంతో బీజేపీ హైకమాండ్ కూడా సోము వీర్రాజు తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.  

సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దాదాపు 200 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు రాజీనామాలకు కూడా సిద్ధపడినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణలా మధ్యలో వచ్చి చేరిన వారే కాకుండా బీజేపీ వ్యవస్థాపక కాలం నుంచీ పార్టీలో పని చేస్తున్న వారు కూడా సోము వీర్రాజు కారణంగా పార్టీ నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు రాజమహేంద్రవరం సమావేశంలో పలువురు మురళీధరన్ దృష్టికి తీసుకు వెళ్లారు.   సోము వీర్రాజునే పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడిగా కొనసాగించాలని భావిస్తే, తాము ఆయనతో పనిచేయడం కష్టమని పలువురు ఈ సమావేశంలో స్పష్టం చేశారంటున్నారు.   

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.