కొందరు అధికారుల తీరు.. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారు!

Publish Date:Mar 14, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు కూడా అన్నీ బాగా ఉన్నా కూటమి సర్కార్  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారుల పట్ల ఉదాశీనంగా ఎందుకు ఉంటోందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాలనాయంత్రాంగంపై పట్టు కోల్పోయిందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కొందరు అధికారుల తీరు కూటమి సర్కార్ ప్రతిష్ఠ మసకబారేలా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి  అధికారులపై నియంత్రణ లేకుండా పోయిదా అన్న భవం కలిగేలా కొందరుర అధికారుల తీరు ఉంటోంది. 
తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి అధికారులపై నియంత్ర లేదన్న భావన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో అధికారులు ఆయా శాఖల మంత్రులను కూడా లేక్క చేయకుండా వ్యవహరించిన ఉదంతాలపై రాష్ట వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకటి రెండు శాఖలని కాకుండా పీఎంవో సహా దాదాపు అన్ని శాఖల్లోనూ కొందరు అధికారుల వ్యవహార శైలి కూటమి సర్కార్ కు చెడ్డ పేరు తీసుకువచ్చేలా, ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచేలా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కాంట్రాక్టర్లతో వ్యవహరించిన తీరుపై  సెక్రటేరీయేట్, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.

బిల్లుల బకాయిలపై మాట్లాడేందుకు తన వద్దకు వచ్చి విజ్ణప్తి చేసిన కాంట్రాక్టర్లతో పియూష్ కుమార్ దురుసుగా  
కాంట్రాక్టుల్లో లాభాలు వచ్చినప్పుడు బానే తీసుకున్నారు కదా? ఇప్పుడు బిల్లుల కోసం కొంత కాలం వేచి చూడలేరా అంటూ మండిపడ్డారట.  ప్రజలకు, ప్రభుత్వానికీ వారథులుగా ఉండాల్సిన అధికారి ఇలా వారి మధ్య అగాధం సృష్టించేలా మాట్లాడటమేమిటన్న విస్మయం వ్యక్తం అవుతోంది. పియూష్ కుమార్ తీరు వల్ల ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజీ అయ్యిందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  ఈ సందర్భంగానే పీయూష్ కుమార్ గతంలో చేసిన నిర్వాకాలను కూడా గుర్తు చేసుకుంటున్నాయి. 

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలోనే  పులివెందులకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరిపేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు కాంట్రాక్టర్లకు ఎలా చెల్లింపులు జరుపుతారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు నిశ్శబ్దంగా ఆమోద ముద్ర వేసింది పియూష్ కుమారే అని తరువాత తేలింది.  సాంకేతిక తప్పిదంగా పీయూష్ కుమార్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్ కు సంబంధించి వేరు బి్ల్లుల హడావుడి చెల్లింపుల వెనుక కూడా పీయూష్ కుమారే ఉన్నారని తేలింది. ఇలా పియూష్ కుమార్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబార్చడం, వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పని చేస్తాన్నారా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.   ఇక సీఎంఓలోని ఒకరిద్దరు ఉన్నతాధికారుల అండతో పీయూష్ ఆర్థిక శాఖను తన ఇష్టం వచ్చిన రీతిలో నడుపుతున్నారన్న ఆరోపణలు ప్రభుత్వ వర్గాల నుంచే వస్తున్నాయి. 

ఒక్క పియూష్ కుమార్ అనే కాకుండా మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ కూడా తమతమ శాఖలలో కొందరు ఉన్నతాధికారుల తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.  ఇటువంటి అధికారులపై అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఉపేక్షిస్తే ప్రభుత్వ ప్రతిష్ట, వ్యక్తిగతంగా చంద్రబాబు ప్రతిష్ట కూడా మసకబారుతుందని తెలుగుదేశం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.