కోడికత్తి జగన్నాటకానికి ఆరేళ్లు

Publish Date:Oct 25, 2024

Advertisement

2019 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకున్న జగన్ ఆ ఎన్నికలలో విజయం కోసం రకరకాల వ్యూహాలు పన్నారు. ఇష్టారీతిగా హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టారు. అలాగే కోడికత్తిదాడి, సొంతబాబాయ్ హత్య ఘటనలను తనకు సానుభూతి వచ్చేలా మలచుకున్నారు. ఎన్నికల పబ్బం గడిచి, అధికార పగ్గాలు అందుకోగానే  కొడికత్తి దాడి కేసు, వివేకా హత్య కేసుల దర్యాప్తునకు ఇసుమంతైనా సహకరించలేదు సరికదా, ఆ కేసుల దర్యాప్తునకు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహనరెడ్డిపై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో  జరిగిందని చెప్పబడుతున్న కోడికత్తి దాడికి ఆరేళ్లు పూర్తయ్యింది.

 2018లో విశాఖ‌ప‌ట్నంలో జ‌గ‌న్‌పై కోడి క‌త్తితో దాడికి పాల్పడ్డాడంటే జనుపల్లె శ్రీను అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జగన్ మాత్రం తనపై దాడి వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ, రాష్ట్ర పోలీసుల విచారణపై నమ్మకం లేదని పట్టుబట్టి మరీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తునకు డిమాండ్ చేసి సాధించుకున్నారు. సరే  ఎన్ఐఏ దర్యాప్తు చేసి జగన్ పై కోడికత్తి దాడి కేసు వెనుక ఎటువంటి కుట్రకోణం లేదని తేల్చేసింది. ఈ కేసులోదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొం టున్న జనుపల్లె శ్రీను బెయిలుకు కూడా నోచుకోకుండా  దాదాపు ఐదేళ్ల పాటు జైల్లో మగ్గిపోయాడు. 

2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ సంఘటన ద్వారా వచ్చిన సానుభూతి ఆ ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయానికి కారణాల్లో ఒకటి అయ్యింది. అలాగే అప్పట్లో జగన్ పై సానుభూతి వెల్లువెత్తడానికి మరో సంఘటన కూడా కారణమైంది.  ఎన్ఐఏ ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని తేల్చేసిన తరువాత కూడా జగన్ కోర్టుకు హాజరై దాడి కేసులో బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడలేదు సరికదా.. ఎన్ఐఏ విచారణనే తప్పుపడుతూ లోతైన దర్యాప్తు పరపాలని కోరుతూ  ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. 

 ఇక్కడ ఒక విషయాన్నిచెప్పుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఒంటిపై గాయాలకు కుట్లు వేసి బ్యాండేజీలు కట్టి అది హత్య కాదు గుండెపోటు అని నమ్మించడానికి జగన్ విఫలయత్నం చేశారు.  ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ గత నాలుగేళ్లుగా కనీసం అరెస్టు కాకుండా హాయిగా తిరుగుతున్నారు.  అరెస్టు చేస్తాం అని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు చెప్పింది. అయినా ఆయ నకు ముందస్తు బెయిలు వచ్చింది.  కానీ హత్యాయత్నం కేసులో అరెస్టైన జనుపల్లె శ్రీనుకు మాత్రం ఐదేళ్ల పాటు బెయిలు దొరకలేదు. జనుపల్లె శ్రీనుకు బెయిలు రావాలంటే ఆ కేసులో బాధితుడిగా ఉన్న జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. జగన్ ఆ పని చేయలేదు.  అప్పట్లో అంటే కోడికత్తితో జగన్ పై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడి వెనుక అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం కుట్ర ఉందంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న సాకుతో ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్నారు.  కానీ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా తనపై జరిగిన దాడి కుట్రదారులకు శిక్ష పడాలని కేసు విచారణ వేగవంతం కావాలని కోరలేదు. పైపెచ్చు కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వకుండా కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా నత్తనడకన సాగేలా చేశారు.  ఈకేసులో బెయిలుకు కూడా నోచుకోకుండా ఐదేళ్ల పాటు జైల్లో మగ్గిపోయిన జనుపల్లె శ్రీనుకు ఎట్టకేలకు కండీషన్డ్ బెయిలు లభించింది అది వేరే సంగతి. అయితే జగన్ తీరు కారణంగా ఇప్పటికే కేసు విచారణ పూర్తి కాలేదు. 

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.