మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువేనట..!

Publish Date:Feb 19, 2026

Advertisement


ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు.  కొందరు మాత్రం ఇలాంటి మాటలు విన్నప్పుడు అదేదో కామెడీ అన్నట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు.  మనిషి వ్యక్తిత్వంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  అయితే మనిషిలో ఉండే లక్షణాలను బట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉందనేది చెప్పవచ్చట. సెల్ప్ రెస్పెక్ట్ లేకపోతే.. ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు చాలామంది.  ఇంతకీ మనుషుల్లో ఏ లక్షణాలు ఉంటే అవి వ్యక్తిత్వం మీద ప్రభావితం చూపిస్తాయి? సెల్ప్ రెస్పెక్ట్ తక్కువ ఉందని ఏ లక్షణాలు సూచిస్తాయి?  మనస్తత్వవేత్తలు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే..

తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పడం..

తప్పు లేకుండా క్షమాపణ చెప్పడం లేదా  అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు అపరాధ భావన కలిగి ఉండటం.. తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉన్నారని  సూచిస్తుందని మనస్తత్వవేత్తలు అంటున్నారు.  నిజంగా ఎవరికైనా హాని చేశారా అని  ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని మనస్తత్వవేత్తలు సలహా ఇస్తున్నారు. ఎవరికి  ఎలాంటి హాని చేయకపోతే ధైర్యంగా, నమ్మకంతో నిలబడాలని చెబుతున్నారు.

తక్కువ చేసి మాట్లాడే వారి ముందు..

ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. కుటుంబ సభ్యులు లేదా లైఫ్ పార్ట్నర్.. స్నేహితులు, ఇతరులు తక్కువ చేసి మాట్లాడినప్పుడు వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతే.. వారి మాటలను అంగీకరించినట్టే.. ఇలా చేస్తే తమను తాము తక్కువ చేసుకున్నట్టే. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఫెయిల్యూర్..

తమను తాము ఫెయిల్యూర్ పర్సన్ గానూ,  తెలివి తక్కువ వారి గానూ భావించే వారికి సెల్ప్ రెస్పెక్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారు తమకు తాము హాని చేసుకుంటారని అంటున్నారు.

ప్రశంసలు, భరోసా..

ఎప్పుడూ తమను ఎవరో ఒకరు పొగుడుతూ, మెచ్చుకుంటూ,  భరోసా ఇస్తూ తమ వెంట ఉండాలని కోరుకునేవారు ఉంటారు. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందట.  మెచ్చుకోలు,  భరోసా లోపించినప్పుడు తాము వేస్ట్ అనుకునే మెంటాలిటీ వీరిలో ఏర్పడుతుందట. ఇది ఎమోషనల్ గా తమను తాము దెబ్బతీసుకోవడానికి దోహదం చేస్తుందట.

ఇతరుల కోసం..

ఇతరుల కోసం బాధపడటం,  అన్నం తినడం మానేయడం,  ఇతరుల కోసం తమను తాము హింసించుకోవడం, ఇతరుల ముందు తమను తాము తక్కువ చేసుకోవడమేనని అంటున్నారు. ప్రతి ఒక్కదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఈ హద్దులను నిర్ణయించుకోలేని వారు సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ కలిగి ఉంటారు.

బంధాలు..

తెలిసో, తెలియకో.. బంధాలు ఏర్పడిపోతాయి. అయితే ఒక చెడు బంధంలో ఉన్నప్పుడు.. అవతలి వ్యక్తి మారతారనే ఆశతో బాధ కలిగించే విషయాలను మభ్యపుచ్చుకోవడం, భరించడం అనేది సెల్ప్ రెస్పెక్ట్  తక్కువగా ఉందని సూచిస్తుంది. అవతలి వ్యక్తి తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పకపోగా,  తమదే తప్పు అని అంగీకరించే వారు సెల్ప్ రెస్పెక్ట్ చాలా తక్కువ కలిగి ఉంటారు.

పోలిక..

ఇతరులతో పోల్చుకునే వారు కూడా తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉంటారు. ఇతరుల జీవితాలతో తమను తాము పోల్చుకోవడం అనేది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.

సెల్ప్ కేర్..

సెల్ప్ కేర్ ఎంత ఎక్కువ ఉంటే వారు అంత  సెల్ప్ రెస్పెక్ట్ కూడా కలిగి ఉంటారు.  చాలామందిలో సెల్ప్ కేర్ అనేది ఉండదు.  తమ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించి,  వారి కోసం అన్నీ చేసి, కష్టపడి.. వారు మెచ్చుకుంటే ఆ మాటలతోనే తృప్తి పడుతుంటారు. అయితే ఇది చాలా తప్పు.  తమ గురించి తాము కేర్ తీసుకోని వ్యక్తులు తమను తాము ఇతరుల ముందు రెస్పెక్ట్ గా నిలబెట్టుకోలేరు.  

                            *రూపశ్రీ.

By
en-us Political News

  
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.