ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం.. ఎముకలను దెబ్బ తీస్తుందా?

Publish Date:Jul 3, 2025

Advertisement


మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ఇవి  శరీరానికి మద్దతు ఇస్తాయి. శరీరంలో అవయవాలను రక్షిస్తాయి,  అంతేకాదు.. శరీరం వివిధ రకాలుగా  కదలడానికి సహాయపడతాయి. అందువల్ల ఎముకలు  జీవితాంతం బలంగా ఉండటం చాలా ముఖ్యం. బలమైన ఎముకలు ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుండి కూడా  రక్షిస్తాయి. అస్టియోపోరోసిస్ సమస్య వస్తే  ఎముకలు బలహీనంగా,  పెళుసుగా మారుతాయి, అవి విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి.

అయితే వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత కూడా ప్రభావితమవుతుంది.  అవి మునుపటి కంటే బలహీనంగా మారుతాయి. కానీ చాలా మందిలో  వయసు పెరిగే ముందే ఎముకలు బలహీనంగా మరడం ఈ మధ్య కాలంలో  ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి  అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఎముకలు బలహీనంగా మారడానికి ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం కూడా ఒకటని వైద్యులు అంటున్నారు.  చాలా షాకింగ్ కు గురిచేసే ఈ విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం..

రోజూ ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేసిన నీటిని తాగితే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా  ఎముకలకు చేతులారా సమస్య తెచ్చిపెట్టినట్టేనట. వాస్తవానికి ప్రతిరోజూ ఈ బాటిళ్లలో నీటిని నిల్వ చేసి వాటి నుండి నీటిని తీసుకుంటే  ఎముకలు బలహీనపడతాయట.

ఎందుకు హానికరం..

ప్లాస్టిక్ బాటిళ్లలో బిపిఎ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరంలోని విటమిన్ డి గ్రాహకాలను ప్రభావితం చేస్తుంది.

విటమిన్-డి గ్రాహకాలు అంటే..

 విటమిన్ డి గ్రాహకాలు అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇవి శరీరం కాల్షియంను గ్రహించడానికి సహాయపడతాయి. కానీ BPA వాటితో జోక్యం చేసుకున్నప్పుడు, శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీని అర్థం పోషకాహారం ఎముకలకు చేరదు. అంటే శరీరానికి తగినంత కాల్షియం ఆహారం ద్వారా తీసుకున్నా అది శరీరం గ్రహించకుండా ఉంటుంది.  ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం దీనికి ప్రధాన కారణం అవుతుంది.

జరిగే ప్రమాదం?

పోషకాహారం ఎముకలకు చేరకపోతే, అది అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు,  పగుళ్లు (ఎముక విరిగిపోవడం) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా మహిళలలో మెనోపాజ్ తర్వాత   ఇప్పటికే కాల్షియం లోపం ఉంటోంది.ఇక ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల ఎముకల సమస్యలు మరింత పెరుగుతాయి.

                                      *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...


 

By
en-us Political News

  
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.