రాహుల్ హామీలకు సిద్దూ బ్రేక్

Publish Date:May 22, 2023

Advertisement

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్దరామయ్యా మధ్య  మరో మహా సంగ్రామం  జరిగింది. ఆ మహా సంగ్రామంలో సిద్దరామయ్య విజయం సాధించారు. సీఎం రేసులో గెలిచిన ఆయన ముఖ్యమంత్రిగా, ఓడిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఇద్దరితో పాటుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  

నిజానికి కనీసం పాతిక మందితో ప్రమాస్వీకారం చేయించి, మొదటి రోజునుంచే హామీలఅమలకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశించారు. రాహుల్ ఆదేశాలను పార్టీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక నేతలకు చేరవేశారు.అయితే  ఏ వర్గానికి ఎన్ని మంత్రి పదవులు అనే లెక్క తేలక  పోవడం వల్లనో ఏమో  ప్రస్తుతానికి ఎనిమిది మంది మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు.  ముఖ్యమంత్రి కుర్చీకోసం నాలుగైదు రోజుల పాటు హోరాహోరీగా పోటీ పడిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ మంత్రి పదవుల విషయంలోనూ అదే   స్పూర్తి కొనసాగిస్తున్నారు. కుర్చీలాట కారణంగా  ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  వారం రోజులకు కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా పది మందితో పాక్షిక మంత్రి మండలి కొలువు తీరే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో  పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటు ఎప్పుడు జరుగ్తుంది అనే విషయంలో ప్రస్తుతానికి ఎవరికీ క్లారిటీ లేదు. మంత్రి పదవుల కోసం అంతర్గతంగా వస్తున్న ఒత్తిళ్ళకుతోడు కాంగ్రెస్ గెలుపునకు కొమ్ము కాసిన ముస్లిం మైనార్టీ వర్గాలు,అలాగే, ఇంకా అనేక ఇతర  వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్ళ నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
అదలా వుంటే...  ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రిమండలి  ప్రమాణ స్వీకార వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు గ్యారెంటీల ప్రస్తావన చేశారు.  ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన ఒకటి రెండు గంటల్లో జరిగే మంత్రిమండలి తొలి సమావేశంలోనే  ఆమోదముద్ర పడుతుందని స్పష్టమైన ప్రకటన చేశారు. ఒక విధంగా ఆ క్షణం నుంచే ఐదు హామీలు అమలు జరిగినట్లే అనుకోవచ్చనే రీతిలో భరోసా కల్పించారు. 

అయితే  రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన తొలి మంత్రి వర్గ సమావేశం జరిగింది. అయితే ఐదు హామీల అమలకు మంత్రి మండలి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందే కానీ  హమీల అమలుకు పచ్చ జెండా అయితే ఊపలేదు. ఐదు హమీల అమలుకు సంవత్సరానికి రూ 50,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. అయినా ఐదు హమీలను అమలు చేసి తీరతామని, వచ్చే మంత్రి మండలి సమావేశంలో విధివిధానాలు ప్రకటించి  హామీల అమలుకు శ్రీకారం చుడతామని  మీడియా సమావేశంలో చెప్పారు.అంటే  ఒక విధంగా, రాహుల గాంధీ హామీలకు సిద్దరామయ్య బ్రేకులు వేశారు. ఫస్ట్ నుంచి నెక్స్ట్ కు పోస్ట్ పోన్ చేశారు. 

కాగా, ఈ ఐదు హామీలు ప్రజలను, ముఖ్యంగా మహిళలను గట్టిగ్గా ఆకట్టుకున్నాయని అందుకే కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికంటే అధిక మెజారిటీ సాధించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ,  ప్రియాంకా వాద్రా మొదటి మంత్రి వర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని హామీలను వెంటనే అమలు చేస్తామని ఇచ్చిహామీని ప్రజలు ముఖ్యంగా మహిళలు నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేశారని అంటున్నారు. అయితే తొలి మంత్రి మండలి సమావేశంలో సూత్రప్రాయ ఆమోదంతో సరిపెట్టడంతో ప్రజల్లో అప్పుడే అనుమానాలు మొదలయ్యాయని అంటున్నారు.

అయితే, ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఆర్థిక అవరోధాలు ఎన్ని ఎదురైనా, హామీలు అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. రూ.3.1 లక్షల కోట్ల బడ్జెట్ లో హామీల అమలుకు రూ.50,000 కేటాయించడం కష్టమేమీ కాదని, 13 మార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనుభవం ఉన్న సిద్దరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదు హామీలు అమలు చేసినా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోదు. ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి అసలే రాదని సిద్దరామయ్య పేర్కొనారు.

రాష్ట్ర అప్పులపై ప్రతి సంవత్సరం రూ.56, 000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నప్పుడు, హమీల అమలుకు రూ. 50,000 కోట్లు ఇవ్వలేమా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అయితే, సిద్దరామయ్య చెప్పిన లెక్కల ఆధారంగా చూసినా రూ.3.1 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ. లక్ష కోట్లకు పైగా రాష్ట్ర అప్పులపై వడ్డీల చెల్లింపు, ఐదు హామీల అమలుకు ఖర్చుచేస్తే ఇక  ఉద్యోగుల జీత భత్యాలు, విద్యా, వైద్యం, వంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కర్ణాటక మరో ఏపీలా అప్పుల కుప్పగా మారుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.