మా నాన్నా కమీషన్లు తీసుకున్నారు.. నోరు జారిన షర్మిల

Publish Date:Jul 26, 2022

Advertisement

మాట్లాడే టప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తొందరపడి మాట జారకూడదు.  మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.నోరు జారితే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయనడానికి మనకు బోలెడు ఉదాహరణలూ సమెతలూ ఉన్నాయి. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ అభిమానులనూ రగిల్చేస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె అయిన షర్మిల తన తండ్రి విషయంలోనే పొరపాటు చేశారు. ఆయన కమీషన్లు తీసుకున్నారన్న అర్దం వచ్చేలా మాట్లాడారు.

తరువాత షర్మిల పీఎస్ ఆమె పొరపాటున మాట్లాడారంటూ ఓ ప్రకటన విడుదల చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో వైస్ మహా నేత అంటూ కాంగ్రెస్ వర్గాలు కీర్తిస్తుంటే, విపక్ష తెలుగుదేశం ఆయన చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులలోని అవినీతిని ఎత్తి చూపుతూ మహా మేత అని విమర్శించారు. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆయన తండ్రిపై విపక్షాలు నాడు చేసిన విమర్శలు నిజమేనని అంగీకరించినట్లుగా ఉన్నాయి. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాలలోకి వచ్చానంటూ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి యాత్రలతో, దీక్షలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న షర్మిల  ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శల బాణాలను సంధిస్తోన్న సంగతి విదితమే. ఘాటు విమర్శలు, పదునైన వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్ గా ఇప్పుడిప్పుడే షర్మిలకు గుర్తింపు వస్తోంది.

డీఎస్ వంటి నేతలు ఆమెను ఆశీర్వదిస్తున్నారు కూడా. అయితే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ఆమె కేసీఆర్ అవినీతిపై విమర్శల బాణాలను సంధించారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులలో అవినీతి వరద పారిందని దుమ్మెత్తి పోశారు. పోలవరం విషయంలో తన అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, కేసీఆర్ కలిసే రాజకీయ లబ్ధి కోసం డ్రామాలాడుతున్నారంటూ చెరిగేశారు. ఆవేశంతో రగిలిపోయారు. ఆ ఆవేశంలోనే ఆమె మాట జారారు. కేసీఆర్ కంటే తన తండ్రే ఎక్కువ అవినీతికి పాల్పడ్డారని అర్ధం వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె పొరపాటున ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఆ తరువాత ఆమె పీఎస్ ఓ ప్రకటన విడుదల చేసినా.. అప్పటికే ఆమె వ్యాఖ్యలు వైరల్ అయిపోయాయి.

సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.  తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులన్నీ మేఘా ఇంజినీరింగ్ సంస్థకు అప్పజెప్పడాన్నితప్పు పడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఒకే కంపెనీకి ఎందుకు ప్రాజెక్టులన్నీ కట్టబెడుతున్నారని నిలదీశారు. కమీషన్ల కోసమే మేఘాకు కాంట్రాక్టులన్నీ అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు.

తన తండ్రి హయాంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. తన తండ్రి ఒక్కరి వద్దే కమీషన్లు తీసుకోలేదని అన్నారు. ఇది కేసీఆర్ ను విమర్శిస్తూ.. తన తండ్రి గొప్పదనాన్ని చెప్పడానికి ఆమె చేసిన ప్రయత్నంలో మాట జారింది. తన తండ్రి వైఎస్ కేసీఆర్ లా ఒక్కరి వద్ద కాకుండా చాలా మంది వద్ద కమిషన్లు తీసుకున్నారన్న అర్ధం వచ్చేలా ఆమె మాట్లాడారు. ఇదే సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. వైఎస్ వ్యతిరేకులంతా ఇప్పటి దాకా మేం చెబుతున్నదంతా వాస్తవమని ఆమె కుమార్తే చెప్పారంటూ సంబరపడుతున్నారు. ఆమె వర్గీయులు మాత్రం అదో టైపో ( స్పెల్లింగ్ మిస్టేక్)లా తీసుకోవాలంటున్నారు.  

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.