జగన్ నీకు క్యారెక్టర్ ఉందా?.. సూటిగా నిలదీసిన షర్మిల!

Publish Date:Feb 7, 2025

Advertisement

ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా సోదరి అయిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జగన్ మోహన్ రెడ్డికి ఇతరుల క్యారెక్టర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని కుండబద్దలు కొట్టారు. 

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ వైసీపీకి గడ్డు కాలం దాపురించినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. అలా వెళ్లి పోతున్నవారిలో జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారూ ఉంటున్నారు. కొద్ది రోజుల కిందటే వైసీపీలో కీలక నేత, జగన్ కుటుంబానికి సన్నిహితుడు, జగన్ అక్రమ కేసులలో సహ నిందితుడు అయిన విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఇక నుంచీ తాను రాజకీయాల జోలికి పోనని ప్రకటించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పట్ల తన స్వామి భక్తిని ప్రదర్శించారు. తనకు అవకాశాలిచ్చినందుకు ఆయనకు కృతజ్ణతలు తెలిపారు. ఇక నుంచి వ్యవసాయమే తన వ్యాపకం అని చెప్పిన విజయసాయిరెడ్డి అన్నట్లుగానే తాను సాగు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపే ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అక్కడితో రాజకీయాలలో, వైసీపీలో విజయసాయి రెడ్డి పాత్రకు ఎండ్ కార్డ్ పడిపోయిందనే అంతా భావించారు. 

అయితే జగన్ విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన కొన్ని రోజుల తరువాత తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ రెడ్డి రాజీనామాపై స్పందించారు.  అన్ని అవకాశాలూ ఇచ్చిన పార్టీని కాదని బయటకు వెళ్లపోవడం సరికాదన్నట్లుగా మాట్లాడారు. రాజకీయాలలో ఎవరికైనా సరే క్యారెక్టర్ ముఖ్యమని అనడం ద్వారా   విజయసాయిరెడ్డికి క్యారెక్టర్ లేదని చెప్పకనే చెప్పారు. 
దీనిపై విజయసాయి కూడా ఘాటుగా స్పందించారు. తనకు క్యారెక్టర్ లేదని జగన్ అనడాన్ని తప్పుపట్టారు. క్యారెక్టర్ ఉంది కనుకనే పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులు కున్నానని చెప్పుకొచ్చారు.  తన క్యారెక్టర్ గురించి జగన్ మాటలు పూర్తి అవాస్తవాలు అన్నదే విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్టు సారాంశం. విజయ సాయి రెడ్డి తరువాత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు విమర్శలు ఉన్నాయి. జగన్ అక్రమ ఆస్తుల కేసులో తాను జైలుకు వెళ్లిన సంగతిని గుర్తు చేస్తూ నిజంగా తనకు క్యారెక్టర్ లేకపోతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని ఉండేవాడినే కాదని చెప్పుకొచ్చారు.

వీరిద్దరి  కౌంటర్ ను తలదన్నేలా ఇప్పడు షర్మిల మీడియా ముందుకు వచ్చి జగన్ క్యారెక్టర్ పై సంచలన విషయాలను వెల్లడించారు.  జగన్ వ్యక్తిత్వం, విశ్వసనీయత గురించి మాట్లాడటం అతి పెద్ద జోక్ గా షర్మిల అభివర్ణించారు.  తోబుట్టువునైన తనపైనా, తన వ్యక్తిత్వంపైనా జగన్ నీచాతినీచంగా బురద జల్లారని షర్మిల ఆరోపించారు. విజయసాయి వైసీపీకి రాజీనామా చేసిన తరువాత తనతో భేటీ అయ్యారని చెప్పిన షర్మిల ఆ సందర్భంగా ఆయన చాలా చాలా విషయాలు చెప్పారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా విజయసాయి గతంలో మీడియా సమావేశంలో మాట్లాడడానికి కారణం జగన్ ఒత్తిడేనని విజయసాయి తనతో చెప్పారనీ, షేర్ల విషయంలో జగన్ చెబుతున్నదంతా అవాస్తవమని తన తల్లి విజయమ్మ లేఖ రాయడంతో మరో సారి మీడియా సమావేశం పెట్టి విజయమ్మలేఖను ఖండించాల్సిందిగా జగన్ విజయసాయిపై ఒత్తిడి తెచ్చారనీ, ఆయన వినకపోవడంతో సుబ్బారెడ్డితో మీడియా సమావేశంలో మాట్లాడించారనీ షర్మిల తెలిపారు. ఈ విషయాలన్నీ విజయసాయి స్వయంగా తనతో చెప్పారని షర్మిల వెల్లడించారు. ఇంత నీచానికి ఒడిగట్టిన జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటమేంటని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ కు క్యారెక్టర్ అంటే అర్ధం తెలియదని దుయ్యబట్టారు.  

మేనకోడలు, మేనల్లుడి ఆస్తులు కాజేయాలని కుట్రలు చేసిన వ్యక్తి జగన్ అని షర్మిల విమర్శలు గుప్పించారు.   జగన్, ఆయన భార్య భారతి బైబిల్ ముందు పెట్టుకుని వారి క్యారెక్టర్ ఏంటో, ఎంత దిగజారిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.