పని మొదలెట్టేసిన ఈటల.. తెరాస నుంచి వలసలు షురూ అవుతాయా?

Publish Date:Jul 26, 2022

Advertisement

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పని మొదలెట్టేశారు. బీజేపీ అధిష్ఠానం అప్పగించిన పని ప్రారంభించేశారు.  చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసేశారు.  టిఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు రానున్న రోజులలో కమలం గూటికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈటల స్వయంగా చెప్పారు.

అంతేనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అత్యధికులకు కేసీఆర్ పై కంటే తనపైనే ఎక్కువ విశ్వాసమని ఈటల పేర్కొన్నారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పార్టీలోకి చేరికలపై దృష్టి సారించాలని సూచించారనీ, అందుకే చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా నియమించారనీ బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈటల రాజేందర్ గతంలో టీఆర్ఎస్ లో కీలక నేత. కేసీఆర్ కేబినెట్ లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా ఈటల పని చేశారు. ఆ తరువాత కేసీఆర్ తో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. ఆ కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో కమలం పార్టీ అభ్యర్థిగా తెరాసపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాను విజయం సాధించినది టీఆర్ఎస్ అభ్యర్థిపై కాదనీ కేసీఆర్ పైనేననీ ఈటల పలు సందర్బాలలో చెప్పారు. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డారు. కేవలం ఆ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎన్ని చేసినా ఈటల విజయాన్ని నిలువరించడంలో మాత్రం కేసీఆర్ విఫలమయ్యారు.

అందుకే తన విజయం టీఆర్ఎస్ అభ్యర్థిపై కాదనీ కేసీఆర్ పైనేనని ఈటల చెబుతున్నారు. తాను వచ్చే ఎన్నికలలో గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్ ను ఆయన ఇలాకాలోనే ఓడిస్తానని సవాల్ కూడా చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఈటలతో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్న సంగతి విదితమే. ముఖ్యంగా పీకే సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు కేటాయించనున్నట్లు కేసీఆర్ భావిస్తుండటం, పీకే సర్వేలో పలువురు సిట్టింగ్ ల పనితీరుపై ప్రజలలో అసంతృప్తి ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో  టీఆర్ఎస్ సిట్టింగులలో గుబులు మొదలైంది. అటువంటి వారంతా ఈటలకు టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రానున్న రోజులలో టీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఈటల ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి లో తొలి నుంచీ పార్టీలో ఉన్న వారికీ, ఆ తరువాత అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చి చేరిన వారికీ మధ్య అగాధం పెరిగిపోయింది. ఈ పరిణామాలు బాగా తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్ కావడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో, కెసిఆర్ నాయకత్వం పై తీవ్ర అసహనం తో ఉన్న నాయకులను గుర్తించి వారిని బిజెపి బాట పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ అత్యధికులకు సీఎం కేసీఆర్ తో కంటే తనతోనే సాన్నిహిత్యం ఎక్కువ అని ఈటల చెబుతున్నారు. వారితో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందనీ, వారంతా ఇప్పటికీ తనతో టచ్ లో ఉన్నారనీ ఆయన అన్నారు.  

అమిత్ షా ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు టార్గెట్ గా ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారు.  తనతో ప్రస్తుతం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, వారు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల చెప్పారు. 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.