సమ్మక్క, సారక్క గుడి కూల్చివేత: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుండగుల దుశ్చర్య.!
Publish Date:Oct 21, 2026
Advertisement
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతోగు గ్రామ పంచాయతీ శివారు ప్రాంతంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క-సారక్క గుడిని దుండగులు ధ్వంసం చేయడం కలకలం సృష్టించింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితికి కారణమైంది. స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు, గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులో వెలసిన ఈ ఆలయంలో స్థానికులు నిత్యం పూజలు చేస్తుంటారు. అటువంటి సమ్మక్క-సారక్క గద్దెలను, గుడిని కూల్చివేత పట్ల భక్తుు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై క పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. [Sammakka Sarakka Temple Destroyed Ananthogu, Bhadradri Kothagudem District, Destruction Sammakka Sarakka Temple, Telugu One]
http://www.teluguone.com/news/content/sammakka-sarakka-temple-destroyed-ananthogu-24-234917.html




