తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల మరో విజయసాయేనా?

Publish Date:Jun 5, 2023

Advertisement

సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు.ఆ పైన వ్యాపార భాగస్వామ్యాన్ని, రాజకీయాలతో ముడివేసి రాజకీయ నాయకుడయ్యారు.అయితే, సజ్జల  జర్నలిస్ట్ జీవితాన్ని పక్కన పెడితే, వ్యాపార, రాజకీయ ప్రయాణంలో ఆయన చాలా వరకు వైఎస్ కుటుంబంతో కలిసే ప్రయాణం చేశారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి తోనే ఆయన రాజకీయ ప్రయాణం సాగింది. జగన్ తో ఆయన రాజకీయ సంబంధాలు, మధ్య మధ్యన కొంత ఒడి దుడుకులు, ఎత్తు పల్లాలు ఎదుర్కున్నా, ఎదురైన అవరోధాలను అధిగమించిన ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు స్థాయికి చేరుకున్నారు. అంతవరకు అన్ని వ్యవహరాలలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిని పక్కకు నెట్టి ఆ స్థానాన్ని సజ్జల సొంత చేసుకున్నారు.

ఆ  విధంగా ఆయన రాజకీయాల్లో మొదటి గమ్యాన్నిచేరుకున్నారు. నిజానికి ఆయన పేరుకు ముఖ్యమంత్రి సలహాదారే కానీ, వాస్తవంలో ఆయన ఇంటర్నల్ స్టేటస్ ఇంకా చాలా చాలా ఎక్కువని వైసీపీ శ్రేణులే చెబుతుంటాయి.  అలాగే సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్ది చెందిన సజ్జల  పార్టీ, ప్రభుత్వ రాజకీయాలపైనే కాకుండా  ప్యాలెస్ రాజకీయాలపై కూడా పట్టు సాధించారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత  ముఖ్య నేతగా చక్రం తిప్పుతున్నారని, ఇంకా స్పష్టంగా చెప్పలంటే డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని  పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఆ కారణంగానే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ కీలక నేతలతో సహా చాలా మంది నాయకులు ఆయన పట్ల చాలా గుర్రుగా ఉన్నారని అంటారు. 

అదలా ఉంటే   ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపధ్యంలో  సజ్జల తిరుగులేని పెత్తనానికి దాదాపుగా చెక్ పడిందన్న వాదన గట్టిగా వినిపించింది. అప్పటి వరకూ సజ్జలపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని బయటకు చెప్పేందుకు జంకిన నేతలు ఇప్పుడు ఆయనపై బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు.  సజ్జల ముఖ్యమంత్రి కళ్ళకు గంటలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు  అంటున్నారు. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కుంటున సంక్షోభానికి సజ్జలే కారణమంటూ వేలెత్తి చూపుతున్నారు. దాదాపు ఇలాంటి ఆరోపణలే, ఇదే స్థాయి అసంతృప్తే   జగన్   మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా వెల్లువెత్తింది.  

ముఖ్యంగా బాలినేని వంటి వారు నేరుగా సజ్జలపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో బాలినేనిని బుజ్జగించడానికి స్వయంగా రంగంలోకి దిగిన సజ్జల ఆ విషయంలో విఫలమై వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తరువాత జగన్ జోక్యంతో బాలినేని కొంత మొత్త పడినా.. సజ్జలపై అప్పట్లో పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తి మాత్రం నివురుగప్పిన నిప్పులా అలాగే రగులుతూ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నివురు తొలగిపోతోందన్న సంకేతాలు బలంగా కనిపించాయి. అయితే  ఆ ఫలితాల అనంతరం నలుగురు పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హతలో అసమ్మతి గళం బహిర్గతం కాకుండా ఒకింత నెమ్మదించడానికి కారణమైంది. అయితే ఆ సమయంలో  ఇంకా చాలా మందిలో అసమ్మతి గూడు కట్టుకుని ఉందన్న వార్తలు వెల్లువెత్తిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. 

ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేశారనే ఆరోపణపై సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు, సజ్జలనే దోషిగా నిలబెడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే,తాము టీడీపీకి అమ్ముడు పోయామని సజ్జల చేసిన ఆరోపణపై సీరియస్  గా రియాక్ట్ అయ్యారు. సజ్జల ఎవరు? అయన చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అంతే కాదు, సజ్జలను వదిలే ప్రసక్తిలేదని, సస్పెన్షన్  గురైన ఇతర ఎమ్మెల్యేలతో చర్చించి, సజ్జలపై పరవు నష్టం దావా వేస్తామని  అన్నారు. అలాగే  ఆయన సజ్జల టార్గెట్’ గా తీవ్ర ఆరోపణలు సైతం చేశారు. చేశారు. అలాగే, సస్పెన్షన్ వెతుకు గురైన మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి కూడా సజ్జల నుంచి తనకు ప్రాణహాని ఉందని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తల దాచుకుంటున్న ఆమె ఏపీకి వెళ్ళాలంటే, సజ్జల ఏమి చేస్తారో అనే భయమేస్తోందని, అన్నారు. 

నిజానికి, చాల కాలంగా సజ్జల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని, అయితే ఎందుకనో వాటిని అంతగా పట్టించుకోలేదని అంటారు. ముఖ్యంగా జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగకుండా చేయడంలో సజ్జల కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే ఇంతకాలం సరైన  సమయం కోసం ఎదురు చూస్తునం సజ్జల బాధితులంతా ఏకమయ్యేందుకు, తెర వెనక ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. జగన్ నేరుగా దిగి బుజ్జగించకుండా ఉన్నట్లైతే ఇప్పటికే పార్టీలో సజ్జలపై భారీ స్థాయిలో తిరుగుబాటు జరిగి ఉండేదని కూడా పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.   జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు,  వైఎస్ రాజశేఖర రెడ్డి ‘ఆత్మ’మిత్రులు,  వైఎస్’కు సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా  వైసీపీలో సజ్జలపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు, నాయకులకు దన్నుగా నిలుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అదలా ఉంటే ఇటీవలి కాలంలో పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల హవా ఒకింత తగ్గిందని కూడా పరిశీలకులు అంటున్నారు.  జగన్ రెడ్డి కూడా  సజ్జలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనీ, త్వరలోనే సజ్జల పాత్ర కూడా పార్టీలో, ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి పాత్రలా నామమాత్రం అయిపోయినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి, 

By
en-us Political News

  
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.