ఓ పతనమా? నీ పేరు సజ్జలా?

Publish Date:Aug 22, 2024

Advertisement

జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగిపోయిన నేతలంత ఇప్పుడు తట్టాబుట్టా సర్దేసుకుని రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారు. స్వయంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ ఏపీకి చుట్టపు చూపుగా వచ్చి వెడుతున్నారు. యధా నేత తథా పార్టీ అన్నట్లుగా వైసీపీ నేతలు కూడా రాష్ట్రం దాటేస్తున్నారు. అలా దాటేస్తున్న వారంతా జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకూ, దుర్మార్గాలకూ, అవినీతికీ పాల్పడిన వారే కావడం గమనార్హం. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా  వీళ్లంతా అధికారం అండ చూసుకుని అడ్డగోలుగా చెలరేగిపోయిన వారే. ఇప్పుడు వీరెక్కడా కనిపించడం లేదు. రాష్ట్రం దాటేశారు. కొడాలి నాని ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వల్లభనేని వంశీ ఎక్కడున్నారో తెలియడం లేదు. ముందస్తు బెయిలు కోసం మాత్రం కోర్టును ఆశ్రయించారు. ఇక ఆర్కే రోజా అయితే తన సహజ స్వభావానికి విరుద్ధంగా సైలెంటైపోయారు. చెన్నై చెక్కేశారని అంటున్నారు. ఇలా వైసీపీలో నోరున్న నేతలంతా నోరు కుట్టేసుకున్నారు. 

ఇక జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారం కోల్పోయాక  మరీ నల్లపూస అయిపోయారు. అంతే కాదు.. పార్టీలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం సజ్జలేనని పార్టీ నేతలూ, శ్రేణులూ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో సజ్జల సైలెంటైపోయారు. జగన్ కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు. 

పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత సజ్జలకు అతికినట్లుగా సరిపోతుందని చెప్పాలి.  నిజానికి ఒక జర్నలిస్ట్’గా, వ్యాపారవేత్తగా ఎదిగొచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి గతం గురించి తెలిసిన ఎవరైనా, ఆయనొక జెంటిల్ మేన్, మంచి మనిషి అనే అంటారు. అయితే, రాజకీయ అరంగేట్రం తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. సరే, అదలా ఉంచి, ప్రస్తుతంలోకి వస్తే, వైసీపీలో నెంబర్ 2 పొజిషన్’లో ఉన్నవిజయ సాయి రెడ్డిని ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడంతో తెరపైకొచ్చిన సజ్జల, ఇక అక్కడ నుంచి, జగన్ రెడ్డి కళ్ళు, చెవులు, నోరూ  అన్నీ తానే అన్నట్లు వ్యవహరించారు. అన్ని శాఖలకు ఆయనే మంత్రి అన్నట్లుగా వ్యవహారం నడిపించారు. ఆల్ ఇన్ వన్ సలహాదారుగా అవతరం ఎత్తారు.   ఇప్పుడు అదంతా గతం. జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయనకు మౌత్ పీస్ గా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు తననే కాదు తన కుమారుడు పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ రెడ్డిని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు. జగన్ అండ చూసుకుని ఇష్టారీతిగా దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడ్డ వైసీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. అలాగే సజ్జలపైనా కేసు నమోదైంది.   ఈ క్రమంలోనే ఆయన ఏపీ వదిలేసి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు. 

జగన్ అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వం తరఫున అయినా, పార్టీ తరఫున అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది సజ్జల మాత్రమే. జగన్ కేవలం బటన్ నొక్కుడు సభలకు మాత్రమే పరదాలు కట్టుకుని బయటకు వచ్చి మాట్లాడేవారు.   వైసీపీలో నోరున్న నేతలుగా గుర్తింపు పొందిన కొడాలి నాని,  అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్  వంటివారు సోషల్  ఎంత రెచ్చిపోయి మాట్లాడటం, బూతులతో చెలరేగి ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికే పరిమితం అయ్యారు. సజ్జల మాత్రం ప్రభుత్వ వెర్షన్ కు పర్యాయపదంగా నిలిచారు. ఆయన మాటలకు  వెయిట్ ఉండేది.   వివేకా హత్య కేసైనా, జగన్‌పై గులకరాయి దాడి గురించైనా వైసీపి వెర్షన్ సజ్జల రామకృష్ణా రెడ్డి నోటి నుంచే వచ్చేది.  ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం తరువాత సజ్జల పార్టీకి శల్యసారథ్యం చేశారన్న విమర్శలు ఇంటా బయటా గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద వైసీపీలో ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పతనమయ్యారు సజ్జల. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.