Publish Date:Aug 13, 2022
తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి చేరినప్పటి నుంచి పార్టీలో అంతా ఖంగారుగానే ఉంది. తెలంగాణాలో టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొని నిలవడానికి పార్టీ మరింత పటిష్ట చేయడంలోనూ తెలంగాణా ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆశించినంత పటిష్ట వ్యూహాలేమీ వేయడం లేదు. దీనికి తోడు ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నాయ కులను అందరినీ సమానంగా చూస్తూ, అందరి అభిప్రాయాలు తెలుసుకుని ముందడుగు వేయ డంలోనూ వెనకబడి పోతున్నారన్న అభిప్రాయాలే వినవస్తున్నా య ని విశ్లేషకులు మాట. ఆయన మీద అనేక ఫిర్యాదులు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి చేరాయి. ఆయన కేవలం పీసీసీ అధ్యక్షుడితో తప్ప వేరే నేతలను పట్టించుకోవడంలేదన్న అభిప్రా యాలు ఉన్నాయి.
పార్టీ నాయకుల్లో ఆయన పట్ల తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మునుగోడు కేంద్రందంగా బీజేపీ వ్యూహరచనతో ముంద డుగు వేస్తుంటే, తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు సరైన సూచనలనిస్తూ ఉత్సాహపర్చకుండా, వారి అభిప్రాయాలను లెక్క లోకీ తీసుకో కుండా కేవలం పీసీసీ అధ్యక్షుడితోనే చర్చిస్తూండడం పట్ల నాయకులు మండిపడుతున్నారు. మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలి తో చాలామంది నాయకులు విసిగెత్తి పార్టీని వదిలేసి వెళ్లే ఆవకాశాలు కనపడుతున్నాయని ఇప్పటికే కొందరు సీనియర్లు ఢిల్లీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.
ఈ సమయంలో మాణిక్కం ఠాగూర్‌ను మార్చి సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్‌కు గానీ మరో నేతను గానీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి మాణిక్యం వైఖరివల్ల పార్టీ మారాల్సివచ్చిందని తెలుస్తోంది. అనేకమంది నేతలు ఢిల్లీలో సీనియర్ నేతలకు ఫోన్లు చేస్తున్నా రని, దీనితో ఠాగూర్ ఏమి చేస్తున్నారని ఢిల్లీ పెద్దలు ప్రశ్నించి నట్లు తెలిసింది. కాగా ప్రియాంక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమిస్తారన్న వదంతులు ఉన్నాయి. అయితే అది ఎంతవరకూ సాకారమవుతాయన్నది అనుమానమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sachin-pilot-to-replace-manikkam-takur-39-141887.html
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.