రుషికొండ ప్యాలెస్ వివాదం.. గంగపుత్రులకు, గిరిపుత్రులకు ఇవ్వాలన్న అడుసుమిల్లి!

Publish Date:Jun 19, 2026

Advertisement

తెలుగువన్  ఎక్స్ క్లూజివ్

 ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయ స్వామి తదితరులు ఈ భవన సముదాయాన్ని సందర్శించిన నేపథ్యంలో, దీనిపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్యాలెస్ నిర్వహణ కోసం ప్రజాధనం భారీగా వృథా అవుతుండటంపై రాజకీయ, సామాజిక విశ్లేషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా..  తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ ప్యాలెస్‌ను సమాజంలో వెనుకబడిన వర్గాలైన గంగపుత్రులకు  , గిరిపుత్రులకు అంకితం చేయాలన్న ప్రతిపాదన చేశారు.  

ఈ ప్యాలెస్‌లోని కొంత భాగాన్ని వారి సాంప్రదాయ ఉత్పత్తుల ప్రదర్శనకు, చేతివృత్తుల ఎగ్జిబిషన్‌కు కేటాయించాలని అడుసుమిల్లి శ్రీనివాసరావు సూచించారు. గిరిజనులు సేకరించే స్వచ్ఛమైన అడవి తేనె, పసుపు, ఔషధ మూలికలతో పాటు, మత్స్యకారుల ఉత్పత్తులను ఇక్కడ విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తే..  పర్యాటకంగా కూడా విశేష ఆదరణ లభిస్తుందన్నారు. దీనివల్ల పర్యాటకులు భారీగా తరలివస్తారని, టికెట్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని అన్నారు.

ప్రస్తుతం ఈ ప్యాలెస్ నిర్వహణ కోసం నెలనెలా పాతిక లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోందనీ,  గతంలో ఇక్కడున్న పర్యాటక రిసార్ట్ ద్వారా ప్రభుత్వానికి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని.. ఇప్పుడు మాత్రం అది భారంగా మారిందని అన్నారు.  

ఈ భవన నిర్మాణానికి కారణమైన గత పాలకుల నుంచి, అందుకు సహకరించిన అధికారుల నుంచి మొత్తం సొమ్మును రికవరీ చేయాలన్నారు.  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయ విమర్శలు రావడం సహజమని, అయితే ఎలాంటి శంకలు లేకుండా నిరుపేదలకు దీనిని కేటాయిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతారని అడుసుమిల్లి అన్నారు. రానున్న క్యాబినెట్ సమావేశంలో దీనిపై ప్రభుత్వం ఎలాంటి  నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

By
en-us Political News

  
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.