Publish Date:Jun 28, 2022
జగన్ వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నానని చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా ఆయన చేసేది అంతా జగన్మాయ మాత్రమే. అమ్మ ఒడి అన్నారు. తీరా లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేశారు. ఒంటరి మహిళలకు పింఛన్ అన్నారు. అమలులోకి వచ్చే సరికి వయస్సు నిబంధనతో లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా కుదించారు. ఇలా ఏ పథకం తీసుకున్నా.. ఏ సంక్షేమం తీసుకున్నా అదే తీరు, అదే రీతి. దుల్హన్ పథకం దగ్గరకు వచ్చే సరికి గత ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహానికి రూ. 50 వేలు ఇచ్చింది...తాను అధికారంలోకి వస్తే లక్ష ఇస్తానని గత ఎన్నికలకు ముందు జగన్ వాగ్దానం చేశారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పడు నిధుల కొరత సాకు చూపుతూ ఆ పథకానికే మంగళం పాడేశారు.
తాజాగా ఆర్టీసీ విలీనం విషయంలోనే జగన్ మాట తప్పారు. మడమ కూడా తిప్పేశారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైసీపీ ప్రకటించింది. జగన్ సీఎం అయిన తర్వాత సాంకేతిక సమస్యలు ఉన్నాయని కేవలం ఉద్యోగుల్ని మాత్రమే ప్రజా రవాణా శాఖ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి విలీనం చేసింది. ఆర్టీసీ మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఆర్టీసీ మొత్తాన్ని లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది.
మళ్లీ లీజు ఏమిటి? ప్రభుత్వంలో విలీనం చేయొచ్చు కదా అంటే మాత్రం సాంకేతిక సమస్యలంటూ నీళ్లు నములుతోంది జగన్ ప్రభుత్వం. అంతే కానీ ఆ సాంకేతిక సమస్యలేమిటన్నది మాత్రం చెపపడం లేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా లీజు వ్యవహారాన్ని తెరైకి తీసుకు వచ్చి పూర్తి చేయడానికి తొందరపడుతోంది. అయితే అదేమీ ఆర్టీసీ మీద ప్రేమతో కాదు.. కేంద్రానికి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేకుండా తప్పించుకోవడానికేనని అంటున్నారు
ఆర్థిక రంగ నిపుణులు. వారికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. కానీ వారు పని చేస్తోంది మాత్రం వేరే సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీలోనే. అంటే ఆర్టీసీ ప్రభుత్వోద్యోగులుగా మారిన తమ పాత ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోందన్నమాట. అందుకు గానూ జీఎస్టీ చెల్లించాలి. ఈ జీఎస్టీని చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ లీజు అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. అయితే ఇక్కడో రహస్యం ఉంది.
ఆర్టీసీని విలీనం చేసుకుంటే ఈ లీజు గొడవ ఉండదుకదా అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే.. ఆర్టీసీ అప్పుల భారం కూడా ప్రభుత్వానికి విలీనం అయిపోతుంది. అదంతా ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. అలాగే ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. అంటే విలీనానికి కేంద్రం అంగీకరించాలి. అలా కేంద్రం అంగీకారం తెలిపితే మొదట కేంద్రం చేసే పని తన వాటాను ఉపసంహరించుకోవడం. అదీ ప్రభుత్వానికి ఆర్థిక భారమే అవుతుంది. అందుకే ఈ బేడదలు.. కాదు కాదు బాధ్యతలేమీ తీసుకోకుండా లీజుతో సరిపెట్టేయాలని జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rtc-only-lease-not-merger-jagan-sarkar-master-plan-39-138604.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.