జమ్మూ కాశ్మీర్ సినీమా హాళ్లలో ఆర్ఆర్ఆర్ సందడి

Publish Date:Sep 22, 2022

Advertisement

జమ్మూకాశ్మీర్ లో వేగంగా సాధారణ పరిస్థితులు  నెలకొంటున్నాయి. మూడు దశాబ్దాలుగా థియోటర్లలో సినీమా చూసేందుకు నోచుకోని కాశ్మీరీ ప్రజ ఇప్పుడు రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకుని హాయిగా బిగ్ స్క్రీన్ మీద సినీమా చూసే అవకాశం లభించింది. అలా లభించిన వారికి మాంఛి విజువల్ ట్రీట్ కూడా లభ్యమైంది. ఎందుకంటే మూడు దశాబ్దాల తరువాత తెరుచుకున్న కాశ్మీర్   సినిమా థియేటర్లలో ప్రదర్శితమైన తొలి సినీమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ నటించిన, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలనూ ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినీమా కాశ్మీర్ థియోటర్లలో సందడి చేస్తోంది.

నిజానికి  జమ్మూ-కశ్మీరు,అనగానే ముందుగా గుర్తుకొచ్చేది, ఉగ్రవాదుల తుపాకుల మోత. నిత్యకృత్యంగా సాగే నరమేథం,మారణహోమం. నగరం నడివీదుల్లో ఉగ్రవాదుల వీరంగం,  సైనికుల ఎదురు కాల్పులు. సరిహాద్దులో క్షణం క్షణం భయభయంగా బతికే అమాయక ప్రజలు. ఎంతో కాలంగా, ఎన్నో  దశాబ్దాలుగా సాగిన ఉగ్రవాద నరమేధంలో ఎన్ని వందల వేల మంది అమాయకులు అమరులయ్యారో, ఎన్ని వేల కుటుంబాలు, అనాధలుగా మిగిలాయో, వేరే చెప్ప నక్కర లేదు. అంతే కాదు, సాధారణ ప్రజల జీవితాలను ఉగ్రవాదం ఎంతలా  చిన్నాభిన్నం చేసిందో, చెప్పేందుకు మాటలు చాలవు. జమ్మూ-కశ్మీరులో 30 ఏళ్లకు పైగా సినిమా హాల్స్ ముతపడే ఉన్నాయి, అంటే, పరిస్థితి ఏమిటో వివరించవలసిన అవసరం లేదు. నిజానికి కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా జమ్మూ-కశ్మీరులో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెల కొంటాయని ఆశించే పరిస్థితి కూడా లేదు. 

కానీ, మూడేళ్ల క్రితం 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత పరిస్థితి క్రమంగా అదుపులోకి ర్వడం మొదలైంది. విభజన అనంతరం కొంతకాలం రాజకీయ అలజడి కొనసాగినా, కేంద్ర పలనలో మెల్లమెల్లగా పరిస్థితి మారుతూ వచ్చింది. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు, మూడు దశాబ్దాల తర్వాత శ్రీనగర్, పుల్వామా, షోపియాన్‌లలో మళ్లీ సినిమా థియేటర్లు తెరుచుకోవడమే నిదర్శనంగా, విశ్లేషకులు భావిస్తున్నారు. 

దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌, పుల్వామాల్లో ఏర్పాటు చేసిన మల్టీఫ్లెక్స్‌లను నిన్న (ఆదివారం) జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రారంభించారు. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిషన్‌ యూత్‌ విభాగం, ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి నిర్మించాయి. నిజానికి, ఇవి కేవలం సినిమా థియేటర్లు మాత్రమే కాదు. బహుళ ప్రయోజన శిక్షణా కేంద్రాలు ఇక్కడ సినిమాల ప్రదర్శనలతో పాటు, సమాచారం, యవత నైపుణ్యాభివృద్ధికి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. త్వరలో ప్రతి జిల్లాలోనూ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒక థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌, మరో మల్టీఫ్లెక్స్‌’లో  భాగ్‌ మిల్కా భాగ్‌లను ప్రదర్శించారు. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.   శ్రీనగర్‌లోని సోంవార్‌ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ మంగళవారం ప్రారంభం కానుంది. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో మూడు థియేటర్లు ఉన్నాయి. లాల్‌ సింగ్‌ ఛడ్డా సినిమాతో ఇవి ప్రారంభం కానున్నాయి. 

పుల్వామా, షోపియాన్లలోని సినిమాహాళ్ల ప్రారంభం సందర్భంగా మనోజ్ సిన్హా   ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక దినమని తెలిపారు. సినిమా హాళ్ళ ప్రారంభానికి సంబందించిన ఫొటోలను షేర్ చేశారు. బాలీవుడ్ చిత్రం ‘భాగ్ మిల్కా భాగ్’ను మనోజ్ సిన్హా వీక్షించారు.‘‘జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం! పుల్వామా, షోపియాన్లలో మల్టీపర్పస్ సినిమా హాల్స్‌ను ప్రారంభించాను. ఇక్కడ మూవీ స్క్రీనింగ్, ఇన్ఫోటెయిన్‌మెంట్, యువతకు నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలు ఉన్నాయి’’ అని సిన్హా కార్యాలయం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొంది. 
జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదం పెచ్చరిల్లడంతో 1990వ దశకం ప్రారంభం నుంచి సినిమా హాళ్లు మూత పడ్డాయి. సుమారు 10 సినిమా హాళ్ళు ఉండేవి, కానీ వాటి యజమానులకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చేవి. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న రీగల్ సినిమా థియేటర్‌పై 1999లో గ్రెనేడ్ దాడి జరిగింది. దీంతో వాటిని మూసేశారు.

కొన్ని థియేటర్లను పునఃప్రారంభించడానికి చేసిన ప్రయత్నాలు అప్పట్లో సఫలం కాలేదు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ, 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేశారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు.  గత సంవత్సరంగా జమ్మూ, కాశ్మీర్ పారిశ్రామిక విధానం, 2021లో భాగంగా మూతబడిన సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధపడింది. ప్రస్తుతం ఉన్న సినిమా హాళ్లను ఆధునీకరించడానికి, అత్యాధునిక సినిమా హాళ్లను నిర్మించడానికి కూడా ప్రోత్సాహకాలు ప్రకటించింది.

మరోవంక, సినిమాల నిర్మాణంకు, షూటింగ్ లకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటించింది. ఒకప్పుడు కశ్మీర్‌ షూటింగ్‌లకు స్వర్గధామంలా ఉండేది. ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన ఫిల్మ్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరిగి అటువంటి వాతావరణం కల్పించడంకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.

ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సినీ నిర్మాణం, చిత్రీకరణలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతోంది. జమ్మూ-కశ్మీరు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషితో సినిమాల ప్రదర్శనతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు అందజేయడం కోసం మల్టీపర్పస్ హాల్స్‌ను నిర్మిస్తున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.