జ్యువెలరీ షాప్‌లో రౌడీషీటర్ వీరంగం

Publish Date:Jun 27, 2026

Advertisement

 

పీకలదాకా మద్యం సేవించారు... నేరుగా జ్యువెలరీ షోరూమ్‌లోకి దూసుకెళ్లారు... కత్తి చూపిస్తూ లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు... డబ్బులు ఇవ్వక పోతే చంపేస్తామని హెచ్చరించి అక్కడ నానా హంగామా సృష్టించారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనతో షోరూం సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నంబర్–10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

రౌడీషీటర్ ఆలీమ్ తన అనుచరుడు యూనస్‌తో  కలిసి పీకలదాకా మద్యం సేవించి షోరూమ్‌లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన వెంటనే మేనేజర్ పంకజ్ బండ్గర్‌ను కత్తితో బెదిరిస్తూ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం అంత డబ్బు లేదని మేనేజర్ చెప్పడంతో ఇద్దరూ మరింత ఆగ్రహానికి గురైననిందితులు షోరూంలోని సిబ్బందిని, మేనేజర్ ను చంపేస్తామంటూ రచ్చ రచ్చ సృష్టించి చివరకు "మళ్లీ వచ్చిన ప్పుడు డబ్బు రెడీగా ఉంచాలి... లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అంటూ బెదిరింపులకు గురి చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు..

ఈ ఘటనతో షోరూంలో ఉన్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం మేనేజర్ పంకజ్ బండ్గర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, షోరూం సిబ్బందికి ప్రాణ హాని ఉందని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకే తిక ఆధారాలు, ఇతర వివరాల ఆధారంగా నిందితులు ఆలీమ్, యూనస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగించింది. వ్యాపారుల భద్రతకు ఎలాంటి భంగం కలిగినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.


 

By
en-us Political News

  
భవిష్యత్ లో ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు జనాభా తగ్గుదలపై సీఎం కీలక వ్యాఖ్యలు..
వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల బాలుడు టాటా ఏస్ వాహనం చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మి
కుల, మతాలకు అతీతంగా జరిపే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఎలా మొదలైంది..?
పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్, ప్రపంచ క్రికెట్ లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం
పెళ్లి పేరుతో అమాయక యువకులను వలలో వేసుకుని నగదు, బంగారం దోచుకుని పరారవుతున్న సీరియల్ పెళ్లికూతురు కథ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
యాపిల్ మాక్ ఓఎస్ యూజర్ల కోసం నార్టన్ వీపీఎన్ స్ప్లిట్ టన్నెలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరుస్తూ, నిర్దిష్ట యాప్‌లను వీపీఎన్ పరిధి నుండి ఎలా మినహాయించవచ్చో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో ఉరుగ్వేపై 1 0 తేడాతో స్పెయిన్ ఘన విజయం. అలెక్స్ బేనా సంచలన గోల్‌తో స్పెయిన్ నాకౌట్ దశకు చేరుకోగా, రెండు సార్లు ఛాంపియన్ ఉరుగ్వే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
చిన్న పిల్లల సురక్షిత టీవీ వీక్షణ కోసం హైసెన్స్ సరికొత్త సేఫ్ స్ట్రీమింగ్ మ్యాజిక్ రిమోట్‌ను పరిచయం చేసింది. 50,000 పైగా చైల్డ్-సేఫ్ ఎపిసోడ్‌లతో కూడిన ఈ సరికొత్త టెక్నాలజీ వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.