రోజాకు నగరిలో ఈసారి అంత వీజీ కాదు

Publish Date:May 3, 2022

Advertisement

ఆర్కే రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన సినీ నటి. ప్రస్తుతం ఏపీలో పర్యాటకశాఖ మంత్రి కూడా. రాజకీయంగా తనకు భిక్షపెట్టిన తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చి వైసీపీ గాలి బాగా వంట బట్టించుకున్న నాయకురాలు. 2014లోను 2019లో కూడా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆమెను చిత్తూరు జిల్లా నగరి నుంచి  ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించారు. అయినప్పటికీ.. రోజా తమ బాగోగులు చూడడంలేదని, మూడేళ్లుగా స్థానిక సమస్యలు పట్టించుకోవడంలేదని నియోజకవర్గం ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం టీవీలో జబర్దస్త్ కార్యక్రమానికే పరిమితం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నగరి నియోజకవర్గంలో రోజా ఇటీవలి కాలంలో పర్యటించినప్పుడల్లా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ప్రతిఘటన ఎదురవుతూనే ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ దళితవాడ మహిళలు, యువకులు రోజాను నిలదీస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మూడేళ్లు ఏపీఐఐసీ చైర్మన్ పదవిలో ఉండి కూడా నియోజకవర్గానికి రోజా ఒరగబెట్టిందేమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.
 
ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 80 వేల 333 ఓట్లు పోలయ్యాయి. అంటే ఆమెకు 47.6 శాతం ఓట్లు వచ్చాయన్నమాట. సమీప టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ 77 వేల 625 ఓట్లు సాధించారు. గెలిచిన రోజాకు సమీప ప్రత్యర్థి గాలి భాను ప్రకాష్ కన్నా కేవలం 2 వేల 708 ఓట్లు మాత్రమే ఆధిక్యం సాధించగలిగారు. అంటే ప్రత్యర్థులిద్దరి మధ్యా ఎన్నికల పోరు నువ్వానేనా అనే విధంగా సాగిందనే చెప్పుకోవాలి. పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బాగా వీస్తున్న సమయంలో కూడా మూడు వేల కన్నా తక్కువ మెజారిటీ రావడంతో వచ్చే ఎన్నికల్లో రోజాకు విజయం అంత సులువేం కాదు అనే అంశంపై ఇప్పటి నుంచే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

అదే నగరి నియోజకవర్గానికి 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా స్థానికులు ఆర్కే రోజాకే పట్టం కట్టారు. అయితే.. అప్పుడు ఆమెకు 47.23 శాతంతో 74 వేల 724 ఓట్లు పడ్డాయి. రోజాకు సమీప ప్రత్యర్థి, మాజీ టీడీపీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడికి 46.69 శాతంతో 73,866 ఓట్లు వచ్చాయి. అంటే 858 ఓట్లు మాత్రమే ముద్దుకృష్ణమ నాయుడి కన్నా అధికంగా రాబట్టుకోగలిగారు. 2014 ఎన్నికల కన్నా 2019 ఎన్నికల్లో అది కూడా వైఎస్ జగన్ గాలి వీస్తున్నప్పుడు కూడా మూడు వేలు లోపే మెజారిటీ రావడం అంటే రోజా బోర్డర్ మెజారిటీ దక్కించుకోవడం కిందే పరిగణించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి నియోజకవర్గం ప్రజలు ముచ్చటగా మూడోసారి ఆమెను అసెంబ్లీ పంపే ప్రసక్తే లేదనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే.. అధికార వైసీపీ ఎమ్మెల్యేగా ఉండడం, నియోజకవర్గాన్ని సరిగా పట్టించుకోపోవడం.. టీవీ షోలతో కాలక్షేపం చేయడం, వచ్చే ఎన్నికల్లో రోజాకు నగరి నియోజకవర్గంలో మూడోసారి ముళ్లకంప ఎదురవుతుందంటున్నారు.

పర్యాటకశాఖ మంత్రి పదవిని రోజాకు సీఎం జగన్ కట్టబెట్టారు. ఈ ఏడాది దాటిపోతే.. వచ్చే సంవత్సరం ఇక ఎన్నికల ఏడాది అవుతుంది. ఈ కొద్ది కాలంలో రోజా మంత్రిగా ఏమాత్రం పనితనం చూపిస్తారో.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధిని చేస్తారో అనే సంశయాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, శ్రేణులను తొందరపెడుతున్నారు. జారిపోతున్న పార్టీ పరువును నిలబెట్టాలని ప్రతిఒక్కరినీ జగన్ పురమాయించారు. ఒక పక్కన పార్టీ బాధ్యతలతో పాటు మరో పక్కన నియోజకవర్గంపై రోజా ఏ మేరకు దృష్టి సారించగలరో అనే సంశయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజానికి ఆర్కే రోజాకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎక్కువ. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి- రోజాకు ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. చిత్తూరు జిల్లాపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు ఎక్కువ. జిల్లాలో ఆయన చెప్పిందే వేదం అన్నట్లుంటుంది. పైగా ఆయన ఒక కొడుకు మిథున్ రెడ్డి లోక్ సభ ఎంపీ. మరో కుమారుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యే. పెద్ది రెడ్డి కుటుంబంలోనే ముగ్గురు ప్రజాప్రతినిధులగా కొనసాగుతున్నారు. నగరి నియోజవర్గంలోనే మంత్రి రోజాకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని రామచంద్రారెడ్డి తయారు చేశారంటారు.

ఇంకో పక్కన రోజాకు ప్రత్యర్థులుగా టీడీపీ నుంచి మరో వెటరన్ నటి దివ్యవాణి బరిలో దిగుతారంటూ ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. మరో పక్కన మరో నటి వాణి విశ్వనాథ్ కూడా నగరి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తారనే అంచనాలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ సారి నగరి నియోజకవర్గంలో ముగ్గురు నటిమణుల మధ్య పోటీ రసవత్తరంగా.. నువ్వా నేనా అనే విధంగా జరిగే అవకాశలు మెండుగా ఉన్నాయి. అలాంటి సందర్భమే వస్తే.. నగరిలో రోజా గెలవడం అంత ఈజీ కాదని, హ్యాట్రిక్ కొట్టే ఛాన్సే ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.