బుల్లి తెరపై ఇక రోజా స్టెప్పులు!

Publish Date:Feb 25, 2025

Advertisement

మాజీ మంత్రి రోజా.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో  స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో   1998లో తెలుగుదేశం నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున 2004 ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి, ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి  నియోజకవర్గం నుంచీ పోటీ చేశారు. అయితే ఆ రెండు సార్లూ రోజా పరాజయం పాలయ్యారు.

వరుసగా రెండు ఎన్నికలలోనూ ఓడిపోయినా చంద్రబాబు ఆమెకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు. కానీ రోజా మాత్రం తన దూకుడుతోనూ, వ్యవహార శైలితోనూ  పార్టీలో ముఖ్య‌నేత‌ల నుంచి, క్యాడ‌ర్ వరకూ అందరి నుంచీ  వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నారు.  ఫ‌లితంగా ఆమె తెలుగుదేశం పార్టీకి దూరమై  2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.   ఆ తర్వాత చోటుచేసుకున్న రాజ‌కీయ‌ పరిణామాల నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా రోజాకు అవ‌కాశం ద‌క్కింది. టూరిజం, క్రీడ‌ల శాఖ మంత్రిగా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

అప్పటి వరకూ ఆమె రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నా సినిమాలూ, స్మాల్ స్క్రీన్ ప్రజెన్స్ లను వదల లేదు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జబర్దస్త్ అనే కామేడీ షోకు జడ్జిగా వ్యవహరించారు. సినిమా హీరోయిన్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో, అంత కంటే ఎక్కువగా జబర్దస్త్ జడ్జిగా పేరు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాలలో చెప్పారు. అదే సమయంలో బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అయి ఉండీ జబర్దస్త్ లో వెకిలి జోకులకు పగలబడి నవ్వడాలేంటన్న విమర్శలనూ మూటగట్టుకున్నారు. అది వేరు సంగతి. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  తరువాత మాత్రం ఆమె జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు.. ఇకపై టీవీ షోలు సినిమాలూ చేయను ప్రజలకే  నా జీవితం అంకితం అంటు ప్రతిజ్ణ కూడా చేశారు.

అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న కల కల్ల అయిపోయింది. ఆమె నగర నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు ఆమె మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. దీంతో గతంలో ఇక సినిమాలు, టెలివిజన్ షోలు చేయను అన్న ప్రతిజ్ణను పక్కన పెట్టేసి మళ్లీ బుల్లి తెరపై రీఎంట్రీకి సిద్ధమైపోయారు.

నగరిలో ఓటమి పాలు అయిన తరువాత రోజా మళ్లీ జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఆమె జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ, బుల్లి తెర ఎంట్రీ మాత్రం ఫిక్సై పోయింది. ఒక ప్రముఖ టీవీ చానెల్ లో ప్రసారం కానున్న ఓ రియాలిటీ షోకు రోజా జడ్జిగా వ్యవహరించనున్నారు. ఆ షోకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా రిలీజ్ అయ్యింది. దీంతో అయితే మంత్రి లేకుంటే టీవీ షోలు అన్నట్లుగా రోజా తీరు ఉందన్న సెటైర్లు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.