బర్త్ డే పేరుతో పోకిరీల హల్‌చల్
Publish Date:Jun 14, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో కొందరు యువకులు బర్త్‌డే వేడుకల పేరుతో హద్దులు మీరుతున్న ఘటనలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అర్థరాత్రి వేళల్లో కాలనీల్లో గుమిగూడి టపాకులు కాలుస్తూ, పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ, కేకలు వేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బర్త్‌డే సెలబ్రేషన్స్ పేరుతో రోడ్లపై గుంపులుగా చేరుతున్న యువకులు అతివేగంగా బైక్‌లు, కార్లు నడుపుతూ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో అర్ధరాత్రి నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడటమే కాకుండా, వృద్ధులు, చిన్నారులు భయభ్రాంతు లకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. టపాకుల శబ్దాలు, బైక్‌ల రేసింగ్, పెద్దగా అరుపులు, కేకలతో కాలనీల ప్రశాంతతకు భంగం కలుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపిం చడం లేదని వాపోతు న్నారు. అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న ఈ పోకిరీ చేష్టలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు రాత్రి పూట పోలీసు పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పుట్టిన రోజు సంబరాలు ఆనందంగా జరుపుకోవాలి.. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా కాదు" అని కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/rogue-activity-in-the-name-of-birthday-36-222902.html





