కేసుల ఆరాటం..భంగపాటుతో ఆయాసం..ఆర్కే నైజం!

Publish Date:May 11, 2022

Advertisement

నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పొంగూరు నారాయణకు బెయిల్ మంజూరైంది. టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ తో ఆయనకు సంబంధం ఉందని చిత్తూరు జిల్లా పోలీసులు మంగళవారం నారాయణను అదుపులోకి తీసుకున్నది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా పెద్ద డ్రామాయే నడిచింది. అయితే.. టీడీపీ హయాంలో అమరావతి భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసును తెరమీదకు తెస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ తదితరులపై ఆర్కే అప్పట్లో కోర్టులో కేసు వేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి చరిత్ర కోర్టులు, కేసులతోనే ముడిపడి ఉందనేది వాస్తవం. అయితే.. ఆర్కే వేసిన ఏ కేసు కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. పైగా కోర్టు నుంచే ఆర్కేకు అక్షింతలు కూడా పడుతుంటాయి. అయినా.. మళ్లీ ఏదో ఒక అంశం మీద కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉండడం ఆర్కే నైజం అంటారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర తేల్చాలంటూ ఆర్కే వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో బాధితులు ఎవరికీ లేని శ్రద్ధ మీకు ఎందుకంటూ హైకోర్టు ఆర్కేని ప్రశ్నించింది. ముందుగా ఆర్కే సీబీఐ కోర్టులో కేసు వేశారు. సీబీఐ కోర్టు తీర్పుపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయిస్తే.. ఆర్కే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ ఆర్కే కేసులు పెట్టారు. చంద్రబాబు సహా అప్పటి ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారిని ఇరికించాలని ఆర్కే యత్నించారు. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్లి భంగపడ్డారు. అయినా.. కేసుల ఆరాటం ఆర్కేకి తగ్గలేదంటారు. అమరావతిలో వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డును అడ్డం పెట్టుకుని చంద్రబాబును ఏ1గా, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణను ఏ2 గా సహా ఇంకా పలువురిపై కేసులు పెట్టారు ఆర్కే.

అమరావతిని రాజధాని చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటి నుంచే ఆర్కే ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అయినా అక్కడ రాజధాని ఏర్పాటుకు ఆర్కే అడ్డుపడుతూనే ఉంటారు. అమరావతికి భూ సమీకరణ సందర్భంగా మున్సిపల్ మంత్రి నారాయణ సభకు ఆళ్ల అడ్డుపడ్డారు. సీఆర్డీయే అధికారులపై దాడి చేశారు. తమ విధులకు ఆర్కే ఆటంకం కలిగించారంటూ అధికారులు కేసు పెట్టారు. అయితే.. ఆర్కేపై నమోదైన ఈ కేసును విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆ తర్వాత కొట్టివేసింది. మంత్రి నారాయణ ఆదేశాలతోనే అధికారులు తనపై కేసులు పెట్టారని ఆళ్ల కక్ష పెంచుకున్నారని రైతులు చెబుతారు. నారాయణపై ప్రతీకారం తీర్చుకునేందుకే అసంబద్ధ ఆరోపణలతో సీఐడీకి ఫిర్యాదు చేశారంటారు.

రాజధాని ప్రాంతంలో దళితులను బెదిరించి భూములు లాక్కున్నారనేది ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణ. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే దళితుల అసైన్డ్ భూములు తక్కువ ధరలకు కొనేసి, తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టి, వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆర్కే ఆరోపణ. రాజధాని నిర్మాణానికి భూములను తాము సమ్మతితో ఇచ్చామని దళితులే చెప్పడంతో ఆర్కేవి తప్పుడు ఆరోపణలే అని తేలిపోయింది. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే దళిత రైతులంతా కలిసి ఎమ్మెల్యే ఆర్కేపైనే అట్రాసిటీ కేసులు పెడతామని దళిత నేత మార్టిన్ హెచ్చరించే దాకా విషయం వెళ్లింది.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోర్టుల్లో రకరకాల కేసులు వేసి అప్పటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు యత్నించేవారు ఆర్కే. గుంటూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయాన్ని వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారని, దానికి ఇచ్చిన లీజ్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో ఆర్కే పిటిషన్ వేశారు. అయితే.. పిల్ వేయడంలో ఆర్కే ఆసక్తి ఏమిటని ప్రశ్నించిన కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వం 150 రూపాయలకే ఫైబర్ నెట్ ద్వారా ఫోన్, టీవీ, ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు యత్నిస్తే.. హైకోర్టులో ఆర్కే కేసు వేసి అడ్డుపడేందుకు యత్నించారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో నకిలీ డిగ్రీ పట్టా పెట్టడాన్ని టీడీపీ నేతలు పసిగట్టారు. ఆ డిగ్రీ కాస్తా 2019 ఎన్నికల నాటికి డిప్లమా డిగ్రీగా మార్చేయడం గమనార్హం. ఎంతసేపూ కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు అంటూ తిరిగే తమ ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో రైతులు కేసు పెట్టారు.

ఆర్కే పెట్టే పెట్టే ఏ కేసులోనూ బాధితులు ఉండరు. తమకు నష్టం జరిగిందనే వారూ ఉండరు. లబ్ధిదారులు ఉండరు. ఫలానా వారికి లాభం కలిగిందనే వారు కూడా ఉండరు. కేవలం ఆర్కే మాత్రమే ఏదో జరిగిపోయిందని కేసులు పెడుతుంటారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.