Publish Date:Jun 22, 2022
మనం గమనించాలే గాని ఆకాశంలో అద్భుతాలు జరుగుతూంటాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణమే మనకు చిన్నప్పటి నుంచి తెలిసినవి. తోకచుక్క పడటం, పెద్ద పెద్ద మెరుపులు వంటివి చూసి ఆశ్చర్య పోవడం మామూలే. మీరెపుడయినా మబ్బులు కొండమీంచి పడుతున్న ఏటి ప్రవాహంలా ఏక ధాటిగా వ్యతిరేక దిశలో ఆకాశంలో వెళుతూండడం చూశారా? ఏదో తెల్లటి నది నేలమీదకి కాకుండా నింగిలోకి వెళుతోన్నట్టు వుంటుంది. అది వివరించడం కంటే చూస్తేనే గొప్ప అనుభూతి, చూసి తీరాలంతే. ఈ మధ్య ఆ వింత ని దక్షిణ ఆస్ట్రేలియాలో జోగార్ గొస్రానీ అనే ఆయన చూసి ఆనందం పట్టలేక ఏకంగా వీడియో తీసి అందరికీ తెలిసేలే చేసేడు.
అనేకానేక మబ్బుతునకలు అమాంతం పెద్ద నదిలా మారి ఒక్కసారిగా ఇళ్ల మీంచి ఖాళీ రోడ్లమీదుగా అలా పైకి పశ్చిమ ఆస్ట్రేలియా స్టెర్లింగ్ రేంజ్ లోని బ్లఫ్ నాల్ పర్వత శిఖరం మీదుగా ఆకాశంలోకి వెళ్లడం అనే ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అది చూడ్డానికి ఆకాశంలోకి వెనుదిరిగి వెళుతోన్న నదిలా తోచింది గోస్రానీకి. అంతే క్షణం ఆలస్యం చేయకుండా వీడియో తీసేడు. నేల నుంచి నింగిలోకి వెళ్లిన నది అని పేరు కూడా పెట్టేడు.
ఆకాశంలో ఉన్నట్టుండి మబ్బులు ఒక్కసారిగా పల్చటి వస్త్రంలా మారి పట్టణం మీంచి పర్వతం చుట్టూ తిరిగి పర్వతం అంచుమీంచి అలా ఆకాశంలోకి ఎవరో పారేసుకున్న పెద్ద వస్త్రంలా ఎగిరిపోయింది. ఇదెలా సంభవం అని ఆశ్చర్యపడే లోగానే అంత అద్భుతం జరిగిపోయింది అని గొస్రానీ అన్నారు. అది ఆరంభ దశలో చూసి సునామీ అనుకుని కాస్తంత భయపడ్డాను. కానీ ఇలా ఆకాశంలో సంభవించి కను విందు చేసే అద్బుతం చూడడం దాన్ని వీడియోలో భద్రపరచడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు గొస్రానీ.
అయితే గొస్రానీ అనుకున్నట్టుగా అది నిజంగా మబ్బులతో ఏర్పడినది కాదని అది నిజానికి సముద్రపు ఏరోసోల్ (ఎస్ ఎస్ ఏ). సహజ ఏరోసోల్‌లో ఒకటి అని అమెరికా జాతీయ వైద్యశాఖ లైబ్రరీ అధికారులు తెలియజేశారు. ఎస్ఎస్ ఏ కూడా అచ్చం మబ్బులానే కనపడు తుంది కానీ గాలి-సముద్ర కలిసేచోట కలిగే రాపిడితో నీటి బుడగలు పగిలిపోవడం వల్ల ఆ రూపం వస్తుందని తెలిపారు. కానీ ఎంతో అబ్బురపరిచే దృశ్యం. అత్యంత అరుదుగా ఆవిష్కృతమయ్యే అద్భుతం!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/river-climbing-to-sky-39-138225.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.