Publish Date:Nov 20, 2024
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టు భయంతో వణికి పోతున్నారు. పోలీసులు తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని భయపడుతున్నారు. ఇదే రామ్ గోపాల్ వర్మ జగన్ అధికారంలో ఉండగా మంచీ చెడూ పట్టించుకోకుండా అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్ ల మార్ఫింగ్ ఫోటోలతో, అనుచిత పోస్టులతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ జగన్ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితికి వచ్చేశారు.
గతంలో ఆయన సోషల్ మీడియాలో చేసిన అనుచిత పోస్టులపై కేసు నమోదైంది. విచారణకు రావాల్సిందిగా నోటీసులు కూడా అందాయి. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన మంగళవారం (నవంబర్ 19) ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే వ్యక్తిగత పనులున్నాయంటూ వాట్సాప్ మెసేజ్ పెట్టి విచారణకు డుమ్మా కొట్టారు. తనకు విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల వ్యవధికావాలంటూ కోరారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ బుధవారం (నవంబర్ 20) హైకోర్టులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
తాను ఎవరి పరువుకూ భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదని ఆ పిటిషన్ లో పేర్కొన్న రామ్ గోపాల్ వర్మ, రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని, తనను అరెస్ట్ చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rgv-petition-in-high-court-for-anticipatory-bail-25-188678.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.