Publish Date:Nov 28, 2024
ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు మూడు రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ అజ్ణాతంలోనే ఉన్నారు. అక్కడ నుంచే వీడియోలు విడుదల చేస్తూ తన కోసం పోలీసుల గాలింపునూ, తన సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదునూ ప్రశ్నిస్తున్నారు. భయం లేదనీ, పోలీసుల కేసులను ఖాతరు చేయననీ గప్పాలు కొడుతున్నారు. అదే సమయంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాలనీ, తనపై కేసులను క్వాష్ చేయాలనీ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. అలాగే తాను భౌతికంగా విచారణకు హాజరు కాలేననీ, తాను సెలబ్రిటీననీ, సినిమాలతో చాలా చాలా బీజీ అని చెప్పుకుంటూ వర్చువల్ విచారణ కోరుతున్నారు.
తనలోని భయాన్ని కప్పిపుచ్చుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఇవన్నీ చేస్తున్నారని నెటిజనులు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు అది వేరే సంగతి. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ ఈ నెల 35న ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన గైర్హాజరయ్యారు. మరో వైపు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అవి ఎప్పుడు విచారణకు వస్తాయో చూడాలి.
ఒక వేళ కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయకపోతే రామ్ గోపాల్ వర్మ ఇంకెంత కాలం అజ్ణాతంలో ఉంటారో, పోలీసుల నుంచి ఎంత కాలం తప్పించుకు తిరగగలుగుతారో చూడాల్సి ఉంది. ఇక ఆయన కోరినట్లుగా వర్చువల్ విచారణ ప్రశక్తే లేదని పోలీసులు కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఎలా చూసినా రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాకుండా ఉండాలంటే కోర్టులు యాంటిసిపేటరీ బెయిపు పిటిషన్ పై సానుకూల తీర్పైనా ఇవ్వాలి. లేదా రామ్ గోపాల్ వర్మ తన అజ్ణాత జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rgv-abscond-continue-25-189151.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.