స్థానిక ఎన్నికల విధానంలో విప్లవాత్మక మార్పులకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం?

Publish Date:Aug 6, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిచంద్రబాబు ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది.  మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ)లతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.  ఇదే కనుక నిజమైతే..  స్థానిక రాజకీయాల్లో  ఇదో విప్లవాత్మక మార్పు అని పరిశీలకులు అంటున్నారు. 

ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది. అంటే..  ఓటర్లు వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎన్నుకుంటే.. ఆ ప్రజాప్రతినిధులు తమ నాయకులను ఎన్నుకుంటారు.  ఈ పరోక్ష ఎన్నికల విధానంపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి  నేపథ్యంలో..  అన్ని స్థాయిల్లోనూ ప్రజలే నేరుగా నాయకులను ఎన్నుకునేలా చట్ట సవరణ తీసుకువచ్చేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.  

ఈ కొత్త విధానం కనుక అమల్లోకి వస్తే..   మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో  ప్రజలు వార్డు కౌన్సిలర్,  కార్పొరేటర్‌తో పాటు మున్సిపల్ ఛైర్మన్,  మేయర్ లను కూడా నేరుగా   ఓటు వేసి ఎన్నుకుంటారు.  అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది.  దీనివల్ల స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరుగుతుంది.  

 పరోక్ష ఎన్నికల సమయంలో క్యాంపు రాజకీయాలు, బేరసారాలు, ఒత్తిళ్లు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలకు ఈ విధానం పూర్తిగా చెక్ పెడుతుంది. అంతే కాకుండా,  మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ, బలవంతపు క్యాంపులు,  ఇతర రాజకీయ  వ్యూహాల వల్ల ఎన్నికల ప్రక్రియలో జాప్యం, వివాదాలకు తావు లేకుండా పోతుంది.  

కాగా ఈ నిర్ణయం పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమౌతోంది.  ఓటర్లు నేరుగా తమ నాయకుడిని ఎన్నుకోవడం వల్ల  పాలనలో పారదర్శకత వస్తుందని, జవాబుదారీ తనం పెరుగుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో త్వరలో   స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటి లోగా సంబంధిత   బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం పొంది  చట్టరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   

Revolutionary refoems in local body elections,  AP Local Body Elections 2026, AP Direct Elections Reform, Andhra Pradesh Local Body Reforms,  municipal chairman,  Mayor Direct Elections 

By
en-us Political News

  
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.