ఏపీ బీజేపీలో తిరుగుబావుటా!

Publish Date:Feb 22, 2023

Advertisement

ఏపీ బీజేపీలో తిరుగుబాటు జరుగుతోందా? క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఆ పార్టీ ఏపీలో ముక్క చెక్కలవ్వడానికి సిద్ధంగా ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఏపీలో రాజకీయంగా బలోపేతం అన్న సాకుతో పార్టీ అధిష్ఠానం అమలు చేసిన వ్యూహాలు, ఎత్తుగడలు పూర్తిగా వికటించాయని అంటున్నారు.

రాష్ట్రంలో కులాల చీలకతో సులభంగా బలోపేతం అవ్వవచ్చన్న అంచనాతో జగన్ సర్కార్ తో అంటకాగిన ఫలితమే.. ఏపీ బీజేపీలో ముసలానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు.  ఏపీ బీజేపీ పట్ల ఆ పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరే రాష్ట్ర నాయకత్వానికీ, క్యాడర్ కూ మధ్య అగాధానికి కారణమైందంటున్నారు.  ఏపీ బీజేపీలో సంక్షోభానికీ, అసంతృప్తికీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డగోలుగా సమర్ధించిన జాతీయ నాయకత్వ తీరే కారణమని పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం తీరు కారణంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారంటున్నారు. అక్కడితో రాజీనామాల పర్వం అగే పరిస్థితి కనిపించడం లేదని కూడా అంటున్నారు.

కన్నా బాటలోనే  మరికొందరు కూడా ఉన్నారని చెబుతున్నారు. కన్నా పార్టీ కార్యకర్తలతో సమావేశమయి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ముందే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రంగంలోకి దిగి బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్ర పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్ధమై విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అయిన నేతలను పార్టీ జాతీయ స్థాయి నాయకుడు  శివప్రకాష్‌జీ వారించారు. ఈ నెల 26న తాను విజయవాడకు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పడంతో బీజేపీలో రాజీనామాల పర్వానికి పడిన తెర తాత్కాలికమేనని పార్టీ శ్రేణులే అంటున్నారు.

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును కొనసాగిస్తే, తాము పార్టీకి రాజీనామా చేస్తామంటూ దాదాపు 200 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు   విజయవాడ కేంద్రంగా ఓ సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమాచారం తెలిసి పార్టీ అధినాయకత్వం వారించింది.  శివప్రకాష్‌జీ ఈనెల 26న విజయవాడ వచ్చి మరీ సమస్యలను పరిష్కరిస్తామన్న హామీలో తిరుగుబాటు జెండా ఎగురవేయడాన్ని వాయిదా వేశారు. గతంలో కూడా రెండు సార్లు  పార్టీలో అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించిన సందర్భాలలో కూడా కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని వారించింది.  ఇప్పుడు ఇది మూడోసారి.  ఈసారి శివప్రకాష్‌జీ సమక్షంలో   తాడో పేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో రాష్ట్ర బీజేపీ  అసమ్మతి నేతలు  ఉన్నారు.  

బుజ్జగించి సమస్య పరిష్కారాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఈ సారి వెనక్కు తగ్గేదే లే అంటున్నారు. ఏపీలో పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు? వైసీపీ విషయంలో పార్టీ అధిష్ఠానం వైఖరి ఏమిటి? సోము వీర్రాజును ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించరు? అని శివప్రకాష్ జీని నిలదీయాలని నిర్ణయించుకున్నట్లు అసమ్మతి నేతలు చెబుతున్నారు.   కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారంలో పార్టీ హైకమాండ్ వ్యవహరించిన తీరు ఏపీలో బీజేపీలో తొలి నుంచీ పని చేస్తున్న వారిలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.  

బీజేపీ వ్యవస్థాపక కాలం నుంచి పనిచేస్తున్న వారిలో సైతం ఏపీ బీజేపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ భూ స్థాపితం అయిపోతుందన్న భావనే వ్యక్తమౌతోందని అసమ్మతి నేతలు చెబుతున్నారు.  ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తుకు మద్దతు విషయంలో పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల వారు అసమ్మతి తెలియజేస్తున్నారు.   35 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఇప్పటికే సంతకాల సేకరణ చేసినట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  సోము వీర్రాజును అధ్యక్షుడిగా కొనసాగించాలని భావిస్తే, తాము ఆయనతో పనిచేయడం కష్టమని ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేశారంటున్నారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల పార్టీ అధినాయకత్వం  వైఖరి ఏమిటన్నది స్పష్టం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.   

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.