రేవంత్ కు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి.. సిద్దార్ధ లూధ్రా
Publish Date:Jun 26, 2015
Advertisement
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి బెయిల్ గురించి ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చల్లో మొదలయ్యాయి. సాక్ష్యాలు తారుమారు చేస్తారని.. సాక్ష్యులను బెదిరిస్తారని చెప్పి ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో తాను హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ పిటిషన్ పై వాదనలు జరిపిన హైకోర్టును విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగాయి. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది సిద్దార్ధ లూద్రా ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి నుండి వాంగ్మూలాన్ని తీసుకున్నారని.. వాంగ్మూలాన్ని తీసుకున్న తరువాత జైలులో ఉంచాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మరోవైపు స్టీఫెన్ సన్ కు ఇచ్చిన.. ఇంకా ఇవ్వాలనుకున్న డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకోవాల్సి ఉందని ఏసీబీ తరపు న్యాయవాది ఏజీ రామకృష్ణారెడ్డి వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా?లేదా ? అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది సిద్దార్ధ లూధ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా కస్టడీలో నాలుగు రోజుల విచారణలో అంతా చెప్పేశానని.. చెప్పడానికి ఇంకా నా దగ్గర ఏం లేదని ఆరోపిస్తున్నారు. కానీ ఏసీబీ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం కలిసి రేవంత్ రెడ్డికి కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారని రాజకీయవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఎందుకంటే నిందితుడిని కస్టడీలో విచారించిన తరువాత అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేయవచ్చు కానీ ఏసీబీ అధికారులు మాత్రం రేవంత్ కు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించింది. రేవంత్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ సింహా, సెబాస్టియన్ లు కూడా బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-39-47772.html





