ఏపీలో పొత్తులపై పునరాలోచన నిజమేనా?

Publish Date:Jul 18, 2023

Advertisement

ఏపీలో ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. వచ్చే ఏడాది తొలి భాగంలోనే ఏపీలో సార్వత్రికలు జరగనున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నా రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఆ మాటకొస్తే ఇంకా ఇది నాన్పుడు ధోరణిలోనే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తులపై ఊహాగానాలు ఊపందుకోవడం.. ఆ తర్వాత మళ్ళీ చల్లబడడం అన్నట్లే ఉంది ఇక్కడ పరిస్థితి. ఆ మధ్య ప్రతిపక్ష ఓటు చీలడం తనకు సుతరామూ ఇష్టం లేదని.. కావాలంటే మనమే ఒక మెట్టు కిందకి దిగి అధికార వైసీపీపై ప్రతిపక్షాలతో కలిసి పోరాడదామని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వగా.. ఈ మధ్య మాత్రం పవన్ నోటి నుండి ఆ ప్రస్తావన రావడం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో కూడా పొత్తులపై ఊసులు లేవు. మరోవైపు బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయడం లేదు.

ఆ మధ్య బీజేపీ దేశవ్యాప్తంగా మిత్రపక్షాలను కలుపుకుపోవాలని, పలు రాష్ట్రాలలో తమతో కలిసి వచ్చే కొత్త వారితో కూడా స్నేహం చేయాలని పిలుపు నిచ్చింది. మిత్ర పక్షాలతో దోస్తీకి సిద్ధమవ్వాలని శ్రేణులకు కూడా బీజేపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ పొత్తుపై చాలా ఊహాగానాలు వచ్చాయి. ముందు తన పాత మిత్రుడు టీడీపీతోనే బీజేపీ ఈసారి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అనంతరం పొత్తు ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అటు బీజేపీ ఇటు టీడీపీ ఎక్కడా స్పదించనే లేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ పొత్తు వ్యవహారంపై సస్పెన్స్ నడుస్తుంది. జులై 18న ఎన్డీఏ విస్తృత సమావేశానికి టీడీపీకి ఆహ్వానం కూడా అందలేదు.  

జులై 18న ఎన్డీఏ విస్తృత సమావేశానికి ఏ జనసేన పార్టీకి మాత్రమే ఆహ్వానం వచ్చింది. జనసేన హాజరైంది. అయినా కూడా ఎటువంటి స్పష్టతా రాలేదు సరికదా..కన్ఫ్యూజన్ మరింత  పెరిగింది.  పరిస్థితి చూస్తుంటే మాత్రం పొత్తులపై పార్టీలు పునరాలోచన చేస్తున్నాయా అనిపిస్తుంది. ముఖ్యంగా అటు బీజేపీ.. ఇటు టీడీపీ పొత్తులపై పునరాలోచన చేస్తున్నాయా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  నిజానికి అమిత్ షా - చంద్రబాబుల భేటీ సమయంలోనే ఈ పొత్తులపై ఏదో ఒక స్టాండ్ కనిపించాల్సింది. కానీ అసలు ఆ భేటీ వివరాలు కూడా బయటకి రాకుండా రెండు పార్టీలు జాగ్రత్తలు తీసుకున్నాయి.

అయితే, పొత్తులపై పునరాలోచన వెనక కారణాలను విశ్లేషించుకుంటే రెండు పార్టీలూ (బీజేపీ, తెలుగుదేశం) ప్రయోజనాలను లెక్కలేసుకొనే వెనక్కు తగ్గినట్లు భావించాల్సి వస్తుంది. ముందుగా టీడీపీ వైపు నుండి చూస్తే బీజేపీతో పొత్తు  వల్ల ఆ పార్టీకి రాష్ట్రంలో పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. సరికదా.. ఒకింత చేటు కలిగే అవకాశం కూడా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి మొత్తం దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం  ఏపీ అనడంలో సందేహం లేదు.  కేంద్రంలో ప్రయోజనాల కోసమే ఇన్నాళ్లు టీడీపీ పొత్తు కోసం చూసింది. అయితే పొత్తు పెట్టుకుంటూ రాష్ట్రంలో బీజేపీపై వ్యతిరేకత  తెలుగుదేశం పార్టీకి కూడా ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.  ప్రత్యేక హోదా  ఇవ్వకపోవడం,  విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయకపోవడం.. కేంద్రం అండతోనే జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందనే అభిప్రాయం ప్రజలలో బలంగా నాటుకుపోయి ఉంది. ఈ వ్యతిరేకత తమపై కూడా చూపించే అవకాశం ఉందని టీడీపీ నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీతో పొత్తు లేకపోయినా తమకు అధికారం దక్కుతుందని టీడీపీ ధీమా తో ఉందనీ, బీజేపీని పక్కన పెట్టి జనసేనను మాత్రం కలుపుకొని పోతే చాలని తెలుగుదేశం భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దాదాపుగా బీజేపీ కూడా ఇలాంటి ప్రయోజనాల గురించే ఆలోచిస్తోందని అంటున్నారు.   టీడీపీతో కలిసి వెళ్లడంతో త్రుణమో ప్రాణమో దక్కుతుంది తప్ప తమ పార్టీ బలపడే ఛాన్స్ ఉండదు. అదే దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్తే పార్టీ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. వచ్చే ఎన్నికల తర్వాత ఓడిన పార్టీలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. టీడీపీ ఓడితే బీజేపీ పురందేశ్వరితో రాజకీయం నడిపించవచ్చు. టీడీపీ గెలిస్తే వరాలు కురిపించి మచ్చిక చేసుకోవచ్చు.  వైసీపీ గెలిస్తే ఇప్పుడు అవలంబిస్తున్న రహస్య చెలిమి సిద్ధాంతాన్నే కొనసాగించవచ్చు. ఈ క్రమంలోనే బీజేపీ నుండి కూడా  పొత్తు విషయంలో పునరాలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే, రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు ఏం జరుగుతుందన్నది . కొన్నాళ్ళు వేచి చూస్తేనే తెలుస్తుంది. 

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.