హ‌మ్మ‌య్య‌.. శాంతించిన వ‌రుణుడు

Publish Date:Jul 19, 2022

Advertisement

ఎడ‌తెరిపి లేకుండా ప‌డుతున్న వ‌ర్షాలు కాస్తంత త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గింది. ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 54వేల అడుగుల‌కు చేరుకుంది. కానీ ఇక్క‌డ మూడో  ప్ర‌మాద హెచ్చరిక మాత్రం కొన‌సాగుతోంది. 53 అడుగుల లోపు త‌గ్గితేగాని ఈ హెచ్చ‌రికను అధికారులు ఉపసంహ రించ‌రు.  

మొత్తంమీద జిల్లాలోని ఏడు మండ‌లాల్లో 71 గ్రామాలు ఇంకా జ‌ల‌దిగ్భంధంలోనే ఉన్నా యి. 12వేల‌కు పైగా ఇళ్లు ముంపున‌కు గురికాగా సోమ‌వారానికి 11 వేల ఇళ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించి, పారిశుధ్య చర్యలను వేగవంతం చేశారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలకు రహదారి లేకపోవడంతో ఆర్మీ హెలికాప్టర్‌ ద్వారా నిత్యావసర సరుకులను తీసుకెళ్లారు. 114 గ్రామాలకు చెందిన 27,778 మంది వరద బాధితులకు 79 పునరావాస కేంద్రాల్లో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

గోదావరి వరద ఉగ్రరూపం దాల్చి తిరిగి తగ్గుముఖం పట్టినా రామాలయం పడమర మెట్లు, విస్తా కాంప్లెక్స్, నిత్యాన్నదాన సత్రం, పలు దుకాణాలు ఇంకా గోదావరి వరద నీటలోనే మునిగి ఉన్నాయి. ఉత్తర ద్వార ప్రాంగణం, మిథిలా స్టేడియం వద్ద కూడా ఇంకా వరద నీరు నిలిచిపోయింది. సీఎం కేసీఅర్ రివ్యూలో మందలించినా జిల్లా యంత్రాంగం తీరు మారలేదు. స్పెషల్ అధికారులు భారీ ఎత్తున వ‌ర‌ద‌ వస్తోందని తెలిసినా ముందే సింగరేణి మోటార్లను తెప్పించడంలో నిర్లక్ష్యం వహించారు. సీఎం కేసీఅర్ సూచన చేసినా వరద నీరు ఎత్తి పోయడంలో అధికారులు విఫలమయ్యారు.

ఇలా వుండ‌గా, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 6,24,610 క్యూసెక్కులకు చేరింది. 85 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. సరస్వతీ బ్యారేజ్ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 17,744 క్యూసెక్కులు కాగా.. దీనికి చెందిన 66 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తు న్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి  తీవ్రస్థాయిలో వరదలొచ్చిన నేపథ్యంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని బొమ్మాపూర్‌ శివారులో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కర కట్ట కోతకు గురైంది. 30 మీటర్ల మేర గండి పడింది. దీంతో సుమారు 25 ఎకరాల్లోని పంటల్లో ఇసుక మేట లు వేసింది. బ్యారేజీ కరకట్టకు వినియోగించిన మట్టితోపాటు రివిట్‌మెంట్‌కు వినియోగించిన బండరాళ్లు పంట చేలల్లో వచ్చి చేరాయి.  ఇప్పుడు వ‌ర‌ద‌ తీవ్రత తగ్గి.. చేను వద్దకు చేరుకున్న రైతులు ఇసుక మేట లను చూసి ఆందోళనకు గురయ్యారు. ఇసుక మేటల కారణంగా పత్తిమొక్కలు పూర్తిగా చనిపోయాయని బాధ‌ప‌డుతున్నారు.  రెండు రోజుల క్రితం బ్యారేజీ ఇదే కరకట్ట  బెగ్లూర్‌ శివారులోని  ఆంజనేయస్వామి ఆలయం వద్ద 50 మీటర్ల మేర కోతకు గురైంది. వరదలు తగ్గితే  ఇంకా ఎన్నిచోట్ల  కోతకు గురై ఉంటుం ద‌నే విషయం బయటపడుతుందని రైతులు అంటున్నారు.

By
en-us Political News

  
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.