ఏపీపై రేణుకా చౌదరి ఫోకస్!

Publish Date:Sep 15, 2022

Advertisement

పరిచయం అక్కర్లేని పేరు రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం   దివంగత నందమూరి తారక రామారావు హయాంలో రేణుకా చౌదరి  ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మనసులో ఉన్నది ఉన్నట్లు సూటిగా సుత్తి లేకుండా చెప్పడం, రాజకీయంగా  ప్రత్యర్థులు ఎంతటివారైనా తన పదునైనా  వాగ్బాణాలతో  వెరుపులేకుండా విమర్శలు గుప్పించడం రేణుకా చౌదరి నైజం. అదే స్పీడును, అదే నిక్కచ్నితనాన్ని, అదే ధైర్యాన్ని ఆమె కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగిస్తున్నారు. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలైన రేణుకా చౌదరి ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించేందుకు రేణుకా చౌదరి రెడీ అవుతున్నారని సమాచారం. ఏపీ రాజధాని అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని,  ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలు నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు  అమరావతి అంశాన్ని అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఏపీ ప్రజలకు సుపరిచితురాలైన రేణుకా చౌదరి చరిష్మా ఇందుకు బాగా దోహదపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ఏపీలో రేణుకా చౌదరి పార్టీ సభలు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఏఐసీసీ ఓ సరికొత్త ప్రణాళికను రెడీ చేసిందని చెబుతున్నారు. అందులో భాగంగానే అమరావతి రాజధాని రైతుల అమరావతి టూ అరసవిల్లి 2.O మహా పాదయాత్ర ప్రారంభోత్సవానికి రేణుకా చౌదరి హాజరయ్యారని చెబుతున్నారు. అమరావతి రైతులతో రేణుకా చౌదరి కొంతదూరం నడిచి మరీ వారికి మద్దతు తెలిపారు.   రైతులు కూర్చున్న ట్రాక్టర్ ను రేణుకా చౌదరి స్వయంగా డ్రైవ్ చేశారు.

వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిందనే కోపంతో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ పార్టీలోని ముఖ్య నేతలు అనేక మంది తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వైసీపీ, టీడీపీ, బీజేపీల్లో చేరిపోయారు. ఏపీలో అత్యంత దీన స్థితిలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఓ లైట్ హౌస్ మాదిరిగా కనిపించినట్లు చెబుతున్నారు.  రేణుకా చౌదరి సభల ద్వారా ఏపీలో మళ్లీ తన ఉనికిని రాబట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని ప్రధాన నగరాల్లో రేణుకా చౌదరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది.

అమరావతి టూ అరసవిల్లి రైతుల మహా పాదయాత్ర సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ సీఎం ఓ మూర్ఖుడు అని, ఆయనకు పరిపాలన చేతకాదంటూ నేరుగా నిప్పులు చెరిగారు. ప్రజలతో ఎలా మాట్లాడాలో జగన్ కు తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మూర్ఖపు పాలనపై రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. జగన్ కు ఎందుకు ఓటు వేశామా? అని ఏపీ ప్రజలు చాలా రోజులుగా బాధపడుతున్నారన్నారు. ఏపీలో తనకు ఎందరో తెలుసని, వారిని పలకరించినప్పుడల్లా జగన్ ఎప్పుడు పోతాడా అని ఎదురుచూస్తున్నామని చెబుతున్నారని రేణుకా చౌదరి అన్నారు.  ఏపీ రాజధాని అమరావతి ఎక్కడికీ పోదని ఆమె ధీమాగా చెబుతున్నారు. కొన్ని నెలల్లోనే జగన్ పాలన అంతం అవుతుందని, తర్వాత ఎలాంటి విఘ్నాలు లేకుండా అమరావతి నిర్మాణం కొనసాగుతుందని రేణుక అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. గతంలో అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు కూడా రేణుకా చౌదరి వచ్చి రైతులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.