ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదా.. ఇవే కారణాలు కావచ్చు..!

Publish Date:Jan 31, 2025

Advertisement


అధిక బరువు ఇప్పట్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య.  మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో సహా చాలా రకాల కారణాలు  బరువు మీద ప్రభావం చూపిస్తాయి.  ఆరోగ్యం మీద స్పృహ పెరుగుతున్న నేటికాలంలో అధిక బరువును వదిలించుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు  తగ్గడంలో ఫెయిల్  అవుతున్న వారే ఎక్కువ.  జిమ్ చేసినా, నడక, వ్యాయామం, డైటింగ్.. ఇలా ప్రతిదీ బరువు తగ్గడానికి చేసే ప్రయత్నమే.. వీటి వల్ల  ఫలితాలు రావడం లేదంటే దీని వెనుక ఇతర కారణాలు చాలా ఉంటాయి.

కేలరీలు..

బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు ఆహారం తీసుకోవడం లో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ  రోజూ ఎన్ని కేలరీల ఆహారాన్ని తింటున్నారో అర్థం చేసుకోరు.   ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నాం, ఎన్ని కేలరీలు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేయగలుగుతున్నాం అనే విషయం చాలా మంది తెలుసుకోరు.  ఇది బరువు  తగ్గకపోవడానికి కారణం అవుతుంది.  బరువు తగ్గాలి  అంటే శరీరంలోకి వెళ్లే కేలరీలకు తగినట్టు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు కూడా ఎక్కువే ఉండాలి.

నిద్ర..

నిద్ర సరిగా లేకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత దెబ్బ తింటుంది.  ఇది ఆకలిని పెంచుతుంది.  బరువు తగ్గడాన్ని కష్టం చేస్తుంది.  అందుకే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు రావాలి అంటే  మంచి నిద్ర  అవసరం.

నీరు..

నీరు శరీరానికి  చాలా ముఖ్యమైనది.  ఇది జీవక్రియను పెంచుతుంది.  ఆకలిని తగ్గిస్తుంది.  రోజూ కనీసం 3 లీటర్లకు పైగా నీరు తీసుకోవడం తప్పనిసరి. లేకపతే బరువు తగ్గడం కష్టం అవుతుంది.

ఒత్తిడి..

చాలామంది ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు.  ఒత్తిడి అనేది మనిషి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.  ఒత్తిడి వల్ల సరిగా నిద్ర పట్టకపోవడం,  ఆహారం ఎక్కువగా తినడం,  హార్మన్ల అసమతుల్యత, కోపం, చిరాకు, అసహనం వంటివి ఉంటాయి. ఇవన్నీ బరువు పెరగడానికి కారణం అవుతాయి.

కార్డియో..

బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తారు.అయితే వ్యాయామంలో కార్డియో వ్యాయామాలు మాత్రమే చేస్తుంటారు.  కండరాలను బలంగా చేసే పనిపై దృష్టి పెట్టకపోతే జీవక్రియ వేగం మందగిస్తుంది.  దీని వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉండదు.

ప్రోటీన్..

ఆహారంలో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి.  ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది.  ఆకలిని తగ్గిస్తుంది.  జీవక్రియను కూడా పెంచుతుంది.  అందుకే ఆహారంలో ప్రోటీన్ తగ్గినా బరువు తగ్గడంలో ఫలితాలు కనిపించవు.

ఫైబర్..

ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండాలంటే ఫైబర్ తప్పనిసరిగా తీసుకోవాలి.  ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు తగ్గడంలో సహాయపడుతుంది.  బరువు తగ్గాలని అనుకునేవారు ఫైబర్ ఆహారాన్ని బాగా తీసుకోవాలి.

ఆరోగ్య సమస్యలు..

కొందరిలో ఆరోగ్య సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి.  ముఖ్యంగా థైరాయిడ్,  పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి సమస్యలు,  ఏదైనా అనారోగ్య సమస్యతో మందులు వాడుతున్నవారు బరువు పెరుగుతారు.


                                             *రూపశ్రీ.


గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 

By
en-us Political News

  
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం చేస్తే శరీరం, మనసుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? సరైన విధానం, శాస్త్రీయ ప్రయోజనాలు, ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? అనే వివరాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రీమతి శ్రావంతి రఘు ఈ వీడియోలో వివరించారు.
Black Spots on Onions,Are They Safe to Eat,Black Mold on Onions,What Black Spots on Onions Really Mean
gut microbiome, dysbiosis, gut brain connection, gut health, gut bacteria, good bacteria, bad bacteria, TeluguOne Health,
Avoid These Pulses During the Rainy Season,Stay Away from These Pulses,Dont Eat These Pulses During the Monsoon
ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.