పేర్ని పాకులాట ఎందుకంటే?

Publish Date:Apr 7, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నియోజకవర్గంలో  తెగ హడావుడి చేస్తున్నారు. అనుచరవర్గాన్ని చెదిరిపోకుండా చూసుకోవడానికి నానా పాట్లూ పడుతున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దాదాపు వైసీపీ క్యాడర్ చెల్లాచెదురైపోయినట్లు కనిపిస్తున్నది. జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది.

గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది. మచిలీపట్నంలో గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పేర్ని నానికి కుమారుడి రాజకీయ అస్తిత్వం కాపాడాలంటే జనంలో కనిపించడం వినా మరో మార్గం లేకుండా పోయింది. అందుకే అవనసరపు హడావుడితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారనీ, కాదు కాదు వార్తల్లో ఉండటానికి పాకులాడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోయిన  నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు మౌనాన్ని ఆశ్రయించినా, ఓడిపోయినప్పటికీ మచిలీపట్నంలో మాత్రం పేర్ని నాని హడావుడి చేస్తున్నారు. స్థానిక అంశాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ప్రతిదానికీ స్పందిస్తూ మీడియా ముందుకు వస్తున్నారు.  కేసులు, అరెస్టులు వంటి బెదిరింపులకు వెనకాడబోమంటూ సవాళ్లు విసురుతున్నారు. వాస్తవంగా కేసులు, అరెస్టుల వరకూ వచ్చే సరికి పలాయనం చిత్తగించి, అవి సద్దుమణగగానే మళ్లీ హడావుడి పెంచుతున్న పరిస్థితి. 

ఇందుకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై పేర్ని నానికి ఉన్న ఆందోళనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పుడు తాను సైలంట్ అయితే.. మచిలీపట్నంలో పోలిటికల్ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకమౌతుందన్న ఆందోళనే నానిని చీటికీ మాటికీ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా లైమ్ లైట్ లో ఉండేందుకు తాపత్రేయపడేలా చేస్తున్నదని అంటున్నారు.

అయితే నాని ఈ తాపత్రేయం ఎంతవరకూ ఫలిస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకమేనని పరిశీలకులు అంటున్నారు. రాజధాని అమరావతికి అతి సమీపంలోని నియోజకవర్గం అయిన మచిలీపట్నంలో అమరావతికి వ్యతిరేక స్టాండ్ తీసుకున్న పార్టీగా వైసీపీ పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రమేనని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేర్ని నాని ఎంతగా పాకులాడినా పట్టు నిలుపుకోవడం అంత తేలిక కాదనీ చెబుతున్నారు. 

By
en-us Political News

  
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
Publish Date:May 3, 2026
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.