భూమీ లేదు.. పత్రాలూ లేవు.. ఏపీ ఎమ్మెల్సీకి పాతిక లక్షలు టోకరా.!

Publish Date:Oct 12, 2026

Advertisement

ఏపీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం సీనియర్ రాజకీయ నాయకుడు సి.రామచంద్రయ్య పాతిక లక్షల రూపాయలకు బురిడీ కొట్టించాడొక మాయగాడు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మోసాలలో  మరో మోసంగా దీనిని పరిశీలకులు అభివర్ణిస్తున్నాడు. ఏపీ ఎమ్మెల్సీ, సీనియర్ పొలిటీషియన్ నే భూమి పేరిట బురిడీ కొట్టించడం సంచలనంగా మారింది. హైదరాబాద్ మాదాపూర్ లో  విలువైన భూమిని విక్రయిస్తామంటూ నమ్మించి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య నుంచి రూ.25 లక్షలు తీసుకున్నాడా వ్యక్తి.  ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   ఐటీ కారిడార్‌  మాదాపూర్‌లో భూమి కొనుగోలు వ్యవహారం ఏకంగా ప్రజాప్రతినిధినే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో సుమారు ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే విక్రయిస్తామంటూ తనను నమ్మించారని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

  పేరూరి తులసీగోపాల్, ఆయన కుమారుడు గిరిధర్   సదరు స్థలాన్ని విక్రయించేందుకు రామచంద్రయ్యను సంప్రదించారు. భూమి న్యాయ వివాదంలో ఉన్నందున తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సి. రామచంద్రయ్యను నమ్మించారు. మాదాపూర్ వంటి కీలక ప్రాంతంలో భూమి కొనుగోలు చేసే అవకాశం ఉందని భావించి ఆయన సై అన్నారు.  ఈ క్రమంలో టోకెన్ అడ్వాన్స్‌గా  పాతిక లక్షలు చెల్లించాలని కోరడంతో రామచంద్రయ్య ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ వారి అక్కౌంట్ కు బదిలీ చేశారు. 

అయితే, అడ్వాన్స్ చెల్లించిన తర్వాత భూమికి సంబంధించిన అసలు యాజమాన్య పత్రాలను న్యాయవాదికి చూపించి పరిశీలించాలని రామచంద్రయ్య కోరినట్లు తెలుస్తోంది. అయితే.. సంబంధిత వ్యక్తులు పత్రాలను అందించకుండా కాలయాపన చేశారు. దీంతో సి.రామచంద్రయ్య   భూమి యాజమాన్య వివరాలపై ఆరా తీశారు. విచారణలో ఆ స్థలానికి సంబంధించి తమకు యాజమాన్య హక్కులు ఉన్నట్లు చెప్పిన వ్యక్తుల వాదనపై సందేహాలు తలెత్తాయి. దీంతో   మోసపోయినట్లు భావించిన రామచంద్రయ్య పోలీసులను ఆశ్రయించారు.  రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు పేరూరి తులసీగోపాల్, గిరిధర్‌తో పాటు మరికొందరిపై   కేసు నమోదు చేశారు. డబ్బులు ఎలా వసూలు చేశారు? భూమి అసలు యజమానులు ఎవరు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.   

[Real Fraud in Madhapur, MLC CRamachandraiah,  Rs 25 Lakh Fraud, Jubilee Hills, Real Estate,   Telugu One]

By
en-us Political News

  
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.