రంగం చిత్రం సీన్ గుంటూరు సభలో ఆవిష్కృతం

Publish Date:Jan 3, 2023

Advertisement

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో రంగం సినిమాలోని సీన్ ఆవిష్కృతమైందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . రాజకీయంగా కుట్రలు ఎలా జరుగుతాయో, రంగం చిత్రంలో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. సభ నుంచి చంద్రబాబు నాయుడు నిష్క్రమించగానే, ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు తమ వంతు సేవ చేయాలని ఉద్దేశంతో చీరల పంపిణీ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే చీరల పంపిణీ ప్రారంభించి ఉంటే, అప్పుడే ఈ సీన్ ను సృష్టించి ఉండేవారేమో. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత పేదలకు చీరలు పంపిణీ చేపట్టారు. కొందరు సభికుల్లో కలసిపోయి ఇతర పార్టీల కార్యకర్తలతో చేరిపోయి తోపులాట జరిపితే, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. గుంటూరు సభలో సరిగ్గా ఇదే జరిగి ఉంటుందని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కందుకూరు లో జరిగిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటన మర్చిపోకముందే, మరొక ఘటన చోటు చేసుకోవడం పరిశీలిస్తే పోలీసు వైఫల్యం, ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. వరుస సంఘటనలను పరిశీలిస్తే, ఈ ఘటన వెనుక కుట్ర కోణం తేట తెల్లం అవుతుంది. ఈ సంఘటన జరిగిన వెంటనే 15 మంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనుమానాలకు తావునిస్తోంది. మృతుల బంధువులను పట్టుకొని చంద్రబాబు నాయుడు సభలకు తమ వారిని బలవంతంగా తరలించారని చెప్పించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే మృతులను చంద్రబాబు నాయుడు సభకు బలవంతంగా తరలించారని బంధువులకు, మృతి చెందిన వారు చెప్పే అవకాశమే లేదు. అటువంటప్పుడు బలవంతంగా తరలించారని చెబుతున్నారంటే అనుమానించక తప్పదు. మృతుల బంధువులతో ఫిర్యాదు చేయించగానే, పోలీసులు ఆఘమేఘాల మీద నిర్వాహకులపై లేదంటే చంద్రబాబు నాయుడు పై ఐపిసి 304 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.

చంద్రబాబునాయుడి సభలు, రోడ్ షోలకు అశేషంగా జనం వస్తున్న నేపథ్యంలో ఆయన సభలు, ర్యాలీలు నిర్వహించుకునే అవకాశం లేకుండా చేసే కుట్రతో వైసీపీయే కుట్రలు పన్నుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షాత్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజే ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లపై రోడ్ షోలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు రాకముందే రఘురామకృష్ణం రాజు ప్రభుత్వం వీటిని నిషేధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సోమవారం రచ్చ బండ కార్యక్రమంలో ఆయనీ మాట చెప్పారు.  అలాగే మాజీ మంత్రి పేర్ని నాని అయితే చంద్రబాబు సభలు, సమావేశాలను నిషేధించాలని సోమవారం (జనవరి 2) డిమాండ్ చేశారు. అసలు సెక్యూరిటీ లేని సభలకు అనుమతి ఇవ్వొద్దని వైసీపీ మంత్రులు, మాజీ  మంత్రులు డిమాండ్ చేయడమే ఆశ్చర్యకరం. అసలు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారికి తెలియదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి సభలకు వేలాది మంది పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తుండగా, చంద్రబాబు సభలకు  పదుల సంఖ్యలో కూడా పోలీసులు కూడా ఉండడం లేదు.  గుంటూరు సభలో  తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే వైసీపీ నాయకులు, మంత్రుల ప్రకటనలను పరిశీలిస్తే,  ఈ సంఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని అనిపించక మానదు.  

By
en-us Political News

  
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.