విజయవాడలో ఘనంగా రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం.!

Publish Date:Nov 16, 2026

Advertisement

విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎంకు ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

ఈ వేడుకకు గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేశారు. ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు.

రామోజీరావు జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ప్రతిభావంతులను గుర్తించి, వారి సేవలను గౌరవించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశం.

రామోజీరావుకు వెంకయ్యనాయుడు ఘన నివాళి.!

మరోవైపు, విలువలతో కూడిన వ్యాపారం, సమాజహితమే జర్నలిజం అని ఆచరణలో చూపించిన మహామనిషి రామోజీరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు.రామోజీరావు పట్టుదల, స్వయంకృషి, క్రమశిక్షణ, చిత్తశుద్ధి, కార్యదీక్ష భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

సాధారణ రైతు కుటుంబంలో ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. ఈనాడు దినపత్రికతో పాటు రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి మహోన్నత వ్యవస్థల నిర్మాణంతో ప్రపంచస్థాయికి చేరిందని గుర్తుచేశారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రామోజీరావు పేరు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని వెంకయ్యనాయుడు తన పోస్టులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: డేటింగ్ యాప్‌లో వల..బీర్‌లో మత్తుమందు..ఆపై బంగారం మాయం.!

 

 

[ Ramoji Excellence Awards, Ramoji Rao,Amit Shah, Chandrababu Naidu, Pawan Kalyan, Justice Abdul Nazeer, Venkaiah Naidu, Eenadu Group, CH Kiran, Ramoji Film City, Vijayawada, Andhra Pradesh ]

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.