నగదు ఊసే లేని రాముడి బ్యాంకు.. రామ్ రమాపతి బ్యాంక్

Publish Date:Apr 7, 2023

Advertisement

పుణ్యం బ్యాంకులో దాచుకున్న సొమ్ము లాంటిది.. కష్టం వచ్చినప్పుడు ఆ పుణ్యమే కాపాడుతుంది అని పెద్దలు సుద్దులు చెబుతుంటారు. కానీ నిజంగానే పుణ్యాన్ని దాచుకునేందుకు ఒక బ్యాంకు ఉంది. మీకు తెలుసా. ఇదేమీ అభూత కల్పన కాదు. నిజ్జంగా నిజం. ఉత్తర ప్రదేశ్ లోని ఓ బ్యాంకు మీ పుణ్యాన్ని డిపాజిట్ గా స్వీకరిస్తుంది. ఆ బ్యాంకు పేరు రామ్ రమాపతి బ్యాంకు. రామకోటి రాస్తే వేయి జన్మల పుణ్యం లభిస్తుందంటారు. రామనామాలు రాస్తే సకల సంపదలూ సిద్ధిస్తాయంటారు. రామ కోటి రాస్తే పుణ్య లోకాలు సంప్రాప్తిస్తాయంటారు. అంటే రామనామ రచన పుణ్యం అన్నమాట. అలా రాసిన రామనామాలను ఓ బ్యాంకు డిపాజిట్ గా స్వీకరిస్తోంది. అంటే పుణ్యాన్ని డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోందన్న మాట.

ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో రామ్ రమాపతి బ్యాంకు.. కార్యకలాపాలు పూర్తిగా రామ నామాలను డిపాజిట్ గా స్వీకరించడానికే పరిమితం. అంటే ఈ బ్యాంకుకు సొమ్ములతో సంబంధం లేదు. కేవలం మానవుడిలోని ఆధ్మాత్మిక భావనతోనే సంబంధం. అందుకే రామ్ రమాపతి బ్యాంక్ ఆధ్మాత్మిక బ్యాంకుగా ప్రసిద్ధం పొందింది. ఆ బ్యాంకులో ‘శ్రీరామ నామాలను’డిపాజిట్ చేసుకుంటారు. రామకొటి  రాసి వాటిని ఏ దేవాలయంలోనే సమర్పిస్తారు భక్తులు. కానీ వారణాశిలోని రామ్‌ రమాపతి బ్యాంక్‌ మాత్రం ఆ కోటి రామనామాలను డిపాజిట్ గా స్వీకరిస్తుంది.  అయితూ అలా డిపాజిట్ గా రామనామాలను జమ చేసుకోవడానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి. రామ కోటిని భక్తి శ్రద్ధలతో రాయాలి. అలా రాయడానికి ఆ బ్యాంకు వారే ఓ పెన్ను ఇస్తారు.  ఆ పెన్ను మామూలు పెన్ను కాదు..   ఓ ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేసిన పెన్ను.

 ఇక ఈ బ్యాంకు ఇప్పటి వరకూ  1,942.34 కోట్ల రామ నామాలను డిపాజిట్ గా స్వీకరించింది.  గత తొమ్మిదిన్నర దశాబ్దాలకు పైగా ఈ బ్యాంకును  మెహ్రోత్రా కుటుంబం గత     ఈ బ్యాంకులో దివంగత ప్రధాని లాలా బహదూర్ శాస్త్రి తల్లి రామనామాలు డిపాజిట్ చేశారు. డిపాజిట్ తీసుకున్నారని తెలిపారు.   ఉల్లి, వెల్లుల్లి వేసిన ఆహారంతోపాటు బయట తయారు చేసిన ఎటువంటి ఆహారం తినకూడదనే నియమం ఉంది. మాంసాహారం అస్సులు ముట్టుకూడదు. ఇలా నియమ నిబంధనలు పాటించి రామనామం రుణం తీర్చుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మతారు. ఈ బ్యాంకకు భారతీయులే కాక కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, జపాన్‌ దేశాల నుంచి కూడా వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు. రామనామాలు రాసే సమయంలో సదరు భక్తులు ఆహార నియమాలనూ పాటించాలి. వెల్లుల్లి, ఉల్లిని పూర్తిగా దూరం ఉంచాలి. మాంసాహారమూ నిషేధమే. అంతేనా.. ఇక్కడ ఖాతా తెరిచిన తరువాత 8 నెలల పది రోజులలో రామనామాలు రాయడం పూర్తి చేసి బ్యాంకుకు డిపాజిట్ చేయాలి. బ్యాంకు వారు ఇచ్చిన పెన్నుతోనే రామనామాలు రాయాలి. అలాగే బ్రహ్మముహూర్తంలోనే రామనామ రచన చేయాలి. అంటే ఉదయం నాలుగు గంటలకు మొదలు పెట్టి 7 గంటల వరకూ రాయాలి. అదీ బ్యాంకు వారు ఇచ్చిన రెడ్ ఇంక్ తోనే రాయాలి.

 ఒక్కో ఖాతాదారుడూ   లక్షా 25 వేల రామ నామాలు రాసి   బ్యాంకులో జమ చేయాలి. అవి సదరు వ్యక్తి ఖాతాలో జయ చేయబడతాయి. ఇలా నిబంధనలు పాటించి భక్తి శ్రద్ధలతో రామనామాలు రాసి బ్యాంకులో జమ చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ బ్యాంకకు భారతీయులే కాదు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, జపాన్‌ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు.

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.