రజనీ వర్సెస్ విజయసాయి.. రసకందాయంలో గుంటూరు వైసీపీ రాజకీయం

Publish Date:Aug 25, 2023

Advertisement

తన దాకా వస్తేనే కానీ తత్వం బోధపడదంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి తత్వం బొధపడే పరిస్థితి వచ్చింది. వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పల్నాడు, బాపట్ల, ఒంగోలు జిల్లాల  బాధ్యతలను ఆ పార్టీ  సీఎం వైయస్ జగన్ కట్టబెట్టిన సంగతి తెలిసిందే.  దీంతో ఆయన  జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

ఆ క్రమంలో పల్నాడు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ చేస్తున్న పవర్ పాలిటిక్స్ అర్థమై షాక్ అయ్యారని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. దీంతో  మంత్రి విడదల రజినీకి విజయసాయి గట్టిగానే క్లాస్ పికారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

 చిలకలూరిపేట నియోజకవర్గం.. గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని... దీంతో పార్టీ శ్రేణుల్లో  తీవ్ర గందరగోళం నెలకొందటూ ఇప్పటికే ఐ ప్యాక్ ఇచ్చిన నివేదికతో.. విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి..  సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశాల సందర్భంగా  మినిష్టర్ రజినీ పవర్ పాలిటిక్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విజయసాయిరెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారని పార్టీ వర్గాల ద్వరా తెలుస్తోంది. 

విడదల రజినీ మంత్రి పదవి చేపట్టిన తర్వాత.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారనీ,  నరసరావు పేట ఎంపీ, వైసీపీ నాయకుడు లావు కృష్ణదేవరాయులుని  సైతం ఆమె లెక్క చేయకుండా.. వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా.. ఎంపీ కృష్ణదేవరాయులకు  ప్రోటోకాల్ ఉండడం లేదని.. అలాగే నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీలో స్థానిక ఎంపీగా లావు కృష్ణదేవరాయలు పర్యటించాలంటే.. మంత్రి రజనీ అండ్ కో అనుమతి మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటున్నారు. దీంతో సదరు ఎంపీ చిలకలూరిపేట అసెంబ్లీ పరిధిలో పర్యటించడం దాదాపుగా మానేశార చెబుతున్నారు.

అయితే రజినీ పవర్ పాలిటిక్స్‌పై గతంలోనే తాడేపల్లి ప్యాలెస్‌లోని పార్టీ పెద్దలకు ఆయన ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎంపీ లావు కృష్ణదేవరాయులు  హార్ట్ అయ్యారనీ, పార్టీ మారే యోచన చేస్తున్నారనీ కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఆయన సైకిల్ ఎక్కి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేసుకొంటున్నట్లు  రాజకీయ వర్గాలలో ఓ చర్చ నడుస్తోంది.   గుంటూరు ప్రస్తుత తెలుగుదేశంఎంపీ గల్లా జయదేవ్.. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో  గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పోటీ చేసే విషయంపై లావు కృష్ణదేవరాయులు దృష్టిపెట్టారన్న చర్చ  ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతోంది.   ఈ నేపథ్యలోనే మంత్రి రజనీపై విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  

పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై   మంత్రి రజనీ కఠినంగా వ్యవహరిస్తున్నారని.. అంతేకానీ పార్టీకి ఎలాంటి చేటు తీసుకు రావడం లేదని.... అలాంటి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమేమిటంటూ రజనీ అనుచరులు విజయసాయిపై కారాలూ, మిరియాలూ నూరుతున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  పల్నాడు జిల్లాలో వైసీపీ బలోపేతం కోసం చిత్తశుద్ధితో  పని చేస్తున్న పై ఎన్నికల వేళ విజయసాయి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రజనీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎన్నికల ముంగిట రజనీ వర్సెస్ విజయసాయిగా గుంటూరు వైసీపీ రాజకీయం రంజుగా మారిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.  

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.