Publish Date:Apr 21, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం లిక్కర్ కుంభకోణం కేసులో సోమవారం అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో, ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు అందుకుని కూడా సిట్ విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం (ఏప్రిల్ 21) అరెస్టు చేశారు. ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు. నకిలీ ఐడీతో విదేశాలకు పారిపోయేందుకు పక్కా ప్రణాళికతో ఆయన గోవా నుంచి మారు పేరుతో హైదరాబాద్ కు వచ్చారు.
ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో అన్నీ తానై వ్యవహరించినట్లుగా రాజ్ కసిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మారుపేరుతో గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఆయన గోవానుంచి రాజేష్ రెడ్డి అనే మారుపేరుతో వచ్చినట్లు తెలుస్తోంది.
ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. అయితే అక్కడ విచారణ జరిగిందా? లేదా అన్న సంగతి తెలియదు కానీ, ఇన్నాళ్లూ గోవాలో తలదాచుకున్న రాజ్ కసిరెడ్డి ఇంకా అక్కడే ఉంటే అరెస్టు తప్పదన్న బయంతో మారుపేరుతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి నకిలీ ఐడీతో విదేశాలకు చేక్కేయాలన్నది రాజ్ కసిరెడ్డి ప్లాన్ అని సిట్ పోలీసులు చెబుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తనను అదుపులోనికి తీసుకున్న సందర్భంగా తాను మంగళవారం (ఏప్రిల్ 22) సిట్ విచారణకు హాజరౌతాననీ, అసలు అందుకోసమే తాను హైదరాబద్ కు వచ్చానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాను ఒక ఆడియో ద్వార తెలియజేసిన సంగతిని కూడా ఆయన సిట్ పోలీసులకు తెలిపారు. అయితే సిట్ అధికారులు మాత్రం మీ మీద నమ్మకం లేదనీ, మీరు విచారణకు హాజరౌతారని తాము విశ్వసించడం లేదనీ విస్పష్టంగా చెప్పి అదుపులోనికి తీసుకున్నారు.
రాజ్ కసిరెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 22) విజయవాడ కోర్ట్లో హాజరు పరిచే అవకాశం ఉంది. ఆ తరువాత కోర్టు అనుమతితో ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని విచారించే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పుడే రాజ్ కసిరెడ్డి వచ్చి ఉంటే ఆయన అరెస్టు అయ్యే వారు కాదనీ, విచారణకు డుమ్మా కొట్టి అజ్ణాతంలోకి వెళ్లినందుకే సిట్ ఆయనను అరెస్టు చేసిందని న్యాయనిపుణులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/raj-kasireddy-arrested-39-196677.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.